స్టీల్ ప్లాంట్ మెడలో గంట కడుతున్న గంటా

ఆ విధంగా ఆయన సొంత పార్టీని సైతం ఇరకాటంలోకి నెట్టారని ప్రచారం సాగింది.

Update: 2024-09-17 02:45 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. అది ఆయన విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నుంచి చేస్తూనే ఉన్నారు. 2021లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని అప్పట్లో కేంద్రం చెప్పడంతో గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ఆ విధంగా ఆయన సొంత పార్టీని సైతం ఇరకాటంలోకి నెట్టారని ప్రచారం సాగింది. మరో వైపు చూస్తే గంటా ఇపుడు కూడా అదే ప్లాంట్ విషయంలో గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లు వైసీపీని టార్గెట్ చేయడానికే ఉంటున్నా అదే సమయంలో సొంత పార్టీ ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారుతోంది అని అంటున్నారు.

స్టీల్ ప్లాంట్ అంశం సున్నితమైనది. ఈ విషయంలో ఎవరు ఏమి చేస్తారు, ఎంతవరకూ చేయగలరు అన్నది తెలియడం లేదు, కేంద్రం ఈ విషయంలో ఏమి ఆలోచిస్తోందో అందరికీ ఎరుకే. అయితే మాది ప్రైవేటీకరణకు వ్యతిరేకరణ విధానం అని గంటా చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీ మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

వైసీపీలో ఇపుడు ఉన్న నేతలు కొందరు నిక్కర్లు వేసుకోని రోజులలోనే వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే టీడీపీ స్టీల్ ప్లాంట్ మీద తన స్టాండ్ ఏంటో చెప్పింది అని గంటా క్లారిటీ ఇస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని మేము కాపాడుకుంటామని ఆయన అంటున్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదని అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ వైసీపీ వారికి రాజకీయం అని తమకు అది సెంటిమెంట్ అని అంటున్నారు గంటా చెప్పేది బాగానే ఉన్నా ఏ నాయకుడు చెప్పకంత ధాటీగా ఆయన చెబుతూ కూటమి తరఫున గొంతుగా మారుతున్నారు. ఈ రోజుకు ఇది మంచిగా ఉన్నా ఒక వేళ ఏమైనా ఇబ్బంది వస్తే అపుడు ఏమిటి అన్న చర్చ సాగుతోంది. ఈ అంశం మీద ఆచీ తూచీ ఎవరైనా రియాక్ట్ కావాల్సి ఉంది.

అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ అయితే సంయమనం పాటించాల్సి ఉంది. కానీ గంటా మాత్రం వైసీపీని గట్టిగా విమర్శించే ఉద్దేశ్యంతో ఉన్నారు.అది మంచిదే కానీ ఈ దూకుడులో కూటమిని కూడా ఇబ్బందులలో నెడుతున్నారా అన్న చర్చ సాగుతోంది. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ విశాఖలోనే ఉన్నారు. అలాగే పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా ఈ ఇష్యూ విషయంలో ఏమి చేయగలమన్నది చూస్తున్నారు. గంటా మాత్రం ప్రతీ రోజూ మీడియా ముందుకు వస్తున్నారు.

ప్రైవేటీకరణ జరగనీయమని అంటున్నారు. అయితే గంటా చెబుతున్న మాటలతో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా డైలాగ్ వార్ జరుగుతోంది. ఇది పొలిటికల్ గా సాగుతోంది తప్ప స్టీల్ ప్లాంట్ కి ఒనగూడేది ఏదీ లేదని అంటున్నారు. కార్మిల లోకం అయితే చంద్రబాబు నుంచే స్పష్టమైన ప్రకటన రావాలని అంటున్నారు. నిజానికి ప్లాంట్ సున్నితమైన అంశం. దీని ని ఎవరూ రాజకీయానికి ఉపయోగించుకోవడానికి లేదు. అది టీడీపీ అయినా లేక వైసీపీ అయినా కూడా బిగ్ ట్రబుల్స్ కి దారి తీస్తుంది.

ఇక చూస్తే కూటమి సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి వారు జాగ్రత్తగానే మాట్లాడాల్సి ఉంటుందని అంటున్నారు. వైసీపీ రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా టీడీపీ నేతలు మాత్రం ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా ఇష్యూనే ఫోకస్ చేస్తేనే అది మరింత జఠిలం కాకుండా ఉంటుందని అంటున్నారు. మరి గంటా మాత్రం మీడియాను చూస్తే చాలు గట్టిగా మాట్లాడుతున్నారు గంటా ఈ విధంగా చేయడం కూటమి సర్కార్ కి మేలు చేస్తోందా వైసీపీ రాజకీయాన్ని దెబ్బ తీస్తుందా ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News