భీమిలీ కోసం గంటా పట్టు...పవన్ ఓకేనా...!?

గంటా ఈసారి భీమునిపట్నం నుంచి పోటీ చేస్తారు అని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అయితే జనసేనతో పొత్తు ప్రకటన తరువాత ఆ సీటు మీద జనసేన కర్చీఫ్ వేసేసింది.

Update: 2024-01-13 03:35 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అన్నది పెద్ద చర్చగా ఉంది. గంటా ఈసారి భీమునిపట్నం నుంచి పోటీ చేస్తారు అని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అయితే జనసేనతో పొత్తు ప్రకటన తరువాత ఆ సీటు మీద జనసేన కర్చీఫ్ వేసేసింది. ఆ పార్టీకి చెందిన పంచకర్ల సందీప్ పోటీకి రెడీ అవుతున్నారు.

ఆయనకు రెండేళ్ళ క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చేశారు. సందీప్ భీమిలి నుంచి జనసేన జెండా ఎగరేయాలని పవన్ కోరుకున్నారు. దాంతో ఆ సీటు విషయంలో సందేహాలు లేవు అని అంటున్నారు. అయితే భీమిలీ మీద గంటా పట్టుదలగా ఉన్నారని అంటున్నారు.

ఆయన ఎలాగైనా పోటీ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పొత్తులో సీటుని వదులుకుంటే గంటాకు తప్పకుండా చాన్స్ దొరుకుంది అని అంటున్నారు. మరి దానికి పవన్ వైపు నుంచి సానుకూలత ఉంటుందా అన్నదే చర్చగా ఉంది. నిజానికి చూస్తే ప్రజారాజ్యంలో కూడా పనిచేసిన గంటాకు జనసేన నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటారు.

దాంతో పాటు భీమిలీలో టఫ్ ఫైట్ ఈసారి సాగుతుందని అంటున్నారు. గంటాకు భీమిలీలో సొంతంగా బలం ఉంది. ఆయన 2014 నుంచి 2019 మధ్యలో ఎమ్మెల్యేగా అక్కడ పనిచేశారు. అయిదేళ్ళ పాటు మంత్రిగా ఉన్నారు. దంతో గంటా వర్గం పూర్తిగా సహకరిస్తేనే కూటమి విజయం సాధ్యపడుతుంది అని అంటున్నారు.

ఇక భీమిలీ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. రాజకీయంగా రాటుదేలిన అవంతికి అన్ని పార్టీలలో మిత్రులు ఉన్నారని అంటున్నారు. గంటా కనుక భీమిలి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా అది వైసీపీకి ఇబ్బందికరమైన పరిణామం అని అంటున్నారు. మరి చంద్రబాబు పవన్ దీని మీద ఎలా ఆలొచిస్తారో అని అంటున్నారు.

ఏది ఏమైనా గంటాకు భీమిలీ సీటు చాలా కీలకం సెంటిమెంట్ అని కూడా అంటున్నారు. ఇప్పటిదాకా ప్రతీ ఎన్నికలోనూ ఓటమి ఎరుగని గంటా రానున్న ఎన్నికలోనూ భీమిలీ సీటు సాధించి గెలుస్తారు అని అంటున్న వారూ ఉన్నారు. పొత్తులలో భాగంగా ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయని సీనియర్ నేతలకు వెసులుబాటు కలిగించే విధంగా సీట్ల షేరింగ్ ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే గంటా భీమిలీ సీటు సేఫ్ గా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News