గంటా సంచలనం... త్వరలో "విశాఖ ఫైల్స్"!

అవును... ఎన్నికల ఫలితాల అనంతరం రుషికొండ భవనాలను వెలుగులోకి తెచ్చిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా మరో బాంబు పేల్చారు.

Update: 2024-07-14 09:55 GMT

ప్రస్తుతం ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంటే... కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం రుషికొండ భవనాలను వెలుగులోకి తీసుకొచ్చిన మంత్రి గంటా శ్రీనివాస రావు వైసీపీని బలంగా కార్నర్ చేశారు. ఈ సమయంలో మరో బాంబు పేల్చారు.

అవును... ఎన్నికల ఫలితాల అనంతరం రుషికొండ భవనాలను వెలుగులోకి తెచ్చిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా మరో బాంబు పేల్చారు. ఇందులో భాగంగా త్వరలో "విశాఖ ఫైల్స్" పేరుతో ఓ సిరీస్ విడుదల చేస్తామని అన్నారు. విశాఖలో జరిగిన భూ దందాలన్నింటినీ అందులో పొందుపరుస్తామని గంటా తెలిపారు.

ఇదే సమయంలో... వైసీపీ భూదందాలపై ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పిస్తామని అన్నారు. "కశ్మీర్ ఫైల్స్" తరహాలో "విశాఖ ఫైల్స్" ని సిద్ధం చేస్తున్నామని చెప్పిన గంటా శ్రీనివాస్... విశాఖ భూఆక్రమణల్లో చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసిన వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు.

ఇదే సమయంలో కొత్తగా ఆక్రమణలకు తావులేకుండా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామని అన్నారు. వాస్తవానికి ఈదఫా గంటాకు మంత్రి పదవి లేకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని చాలా మంది భావించారు కానీ... ఆయన మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా వైసీపీని టార్గెట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

ప్రధానంగా ఆ మధ్య రుషికొండ భవనాల వద్దకు తనతో పాటు మీడియాను తీసుకెళ్లి హడావిడి చేశారు. ఆయన వెళ్లిన తర్వాతే... ఆ భవనాల్లో లోపల ఏముంది, ఎలా ఉంది అనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాతే అక్కడున్న బాత్రూం లు, బాత్ టబ్ లు, ఇతర విలువైన ఫర్నిచర్ పై నేషనల్ మీడియాలో సైతం పెద్ద చర్చ జరిగింది.

Tags:    

Similar News