స్థాయి క్రెడిట్ గంటా దేనా....బాబు మెచ్చుకోవాల్సిందే !

విశాఖ స్థాయి సంఘం ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు ఎవరి ఖాతాలో అంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకే అధిక భాగం క్రెడిట్ అని అంటున్నారు.

Update: 2024-08-09 03:42 GMT

విశాఖ స్థాయి సంఘం ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు ఎవరి ఖాతాలో అంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకే అధిక భాగం క్రెడిట్ అని అంటున్నారు. ఆయన మొదటి నుంచి మోనిటరింగ్ చేస్తూ వస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కార్పోరేటర్లు కూటమి వైపు మళ్లేలా చేశారు. మొత్తానికి జీవీఎంసీలో కూటమి జెండా ఎగిరేలా చేశారు.

దాంతో ఆయనకే ఇందులో అధిక భాగం క్రెడిట్ ఇవ్వాలని ఆయన అనుచరులు అంటున్నారు. మరో వైపు చూస్తే మేయర్ పీఠాన్ని కూడా కదిలించి వేస్తామని గంటా వర్గం అంటోంది. ఇప్పటికే మైనారిటీలో వైసీపీ పడిపోయిందని దాంతో మేయర్ సీటుని కూడా తామే కైవశం చేసుకుంటామని అంటున్నారు.

స్థానిక సంస్థల చట్ట సవరణలో రెండేళ్ళకే అవిశ్వాసం పెట్టవచ్చు అని చట్టాన్ని మారుద్దామని అనుకున్నారు కానీ ఇపుడు చూస్తే ఆ అవసరం లేదని అంటున్నారు. వైసీపీ తెచ్చిన చట్ట సవరణల మేరకు నాలుగేళ్ళకు అవిశ్వాసం మేయర్ మీద చైర్మన్లు లేదా జెడ్పీ చైర్మన్ల మీద పెట్టవచ్చు.

మరి కొద్ది నెలలు ఆగితే నాలుగేళ్ల పాలన స్థానిక సంస్థలు పూర్తి చేసుకుంటాయి. దానో ఆటోమేటిక్ గా అవిశ్వాసం పెట్టి దించేయవచ్చు అని అంటున్నారు. లేదా ఈ మధ్యలో చట్ట సవరణ చేస్తే ముందుగానే పదవులు పోతాయని అంటున్నారు.

ఇక మంత్రి పదవి దక్కనందుకు టీడీపీ అధినాయకత్వాన్ని మచ్చిక చేసుకునే పనిలో గంటా ఉన్నారు. ఆయన మేయర్ పీఠాన్ని కూడా టీడీపీ కూటమి ఖాతాలో వేసి మరిన్ని మార్కులు కొట్టేయాలని అనుకుంటున్నారు అని అంటున్నారు.

అయితే టీడీపీలో మంత్రి పదవులు అన్నీ భర్తీ అయిపోయాయి. ఒక్కటే ఖాళీ ఉంది. అది విశాఖకు ఇవ్వవచ్చు అని కూడా అంటున్నారు. ఓసీ కాపు కోటాలో దాని కోసమే గంటా ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. కానీ టీడీపీ ఈసారి కొత్త ముఖాలకు జూనియర్లకు అవకాశం ఇవ్వాలని ముందే ఒక నియమం పెట్టుకున్నట్లుగా మంత్రివర్గం కూర్పు కనిపించింది.

దాంతో గంటా లాంటి వారి ఆశలు ఏ మేరకు తీరుతాయన్నది చూడాలి. ఏది ఏమైనా తన హవా తగ్గలేదని చాటుకోవడానికి మాత్రం మాజీ మంత్రి ప్రయత్నిస్తున్నారు. జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. అదే టైం లో చంద్రబాబు పాలనను పొగుడుతున్నారు. గంటాకు ఇది దాదాపుగా చివరి చాన్స్ అని అంటున్నారు దాంతో విస్తరణలో అయినా మంత్రి పదవిని పొందాలని ఆ విధంగా సంతృప్తిగా తన రాజకీయ పదవీ విరమణ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి టీడీపీ అధినాయకత్వం ఆయన మీద ఎలాంటి కరుణా కటాక్షాలు కురిపిస్తుందో.

Tags:    

Similar News