జార్జియాలో 11 మంది భారతీయులు దుర్మరణం... కారణం అదేనా?
జార్జియాలో తీవ్ర విషాదం చోటు చేసుకొంది. ఇందులో భాగంగా... జార్జియాలోని మౌంటైన్ రిసార్ట్ గుడౌరీలోని రెస్టారెంట్ లో 11 మంది భారతీయులు మరణించారు
జార్జియాలో తీవ్ర విషాదం చోటు చేసుకొంది. ఇందులో భాగంగా... జార్జియాలోని మౌంటైన్ రిసార్ట్ గుడౌరీలోని రెస్టారెంట్ లో 11 మంది భారతీయులు మరణించారు. ఈ మేరకు ఈ విషయాలను భారత మిషన్ తెలిపింది. బాధితులంతా కార్బన్ మోనాక్సైడ్ విషం కారణంగా మరణించారని పోలీసులు చెబుతున్నారని అంటున్నారు.
అవును... జార్జియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కార్బన్ మోనాక్సైడ్ విషం కారణంగా 11 మంది భారతీయులు చనిపోయారని భారత మిషన్ తెలిపింది. అయితే... ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తులో గాయం లేదా హింసకు సంబంధించిన సంకెతాలు ఏమీ కనిపించలేదని జార్జియా అంతర్గత వ్యవహారాక మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ సందర్భంగా స్పందించిన టిబీలిసీలోని ఇండియన్ మిషన్.. గౌడౌరీలో దురదృష్టవశాత్తు 11 మంది భారతీయ పౌరులు మరణించడం అత్యంత బాధాకరమని.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపింది. మృతదేహాలను భారత్ కు త్వరగా రప్పించేందుకు రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తుందని వెల్లడించింది.
అయితే... మృతులంతా గుడౌరీలోని హవేలీ అనే భారతీయ రెస్టారెంట్ లో పనిచేస్తున్నారని.. బాధితులు 12 మందీ భారతీయ పౌరులే అని తొలుత మిషన్ తెలపగా... 11 మంది మాత్రమే భారతీయులని, ఒకరు స్థానిక పౌరుడే అని జార్జియా అంతర్గత వ్యవహారాల మంత్రివ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
అయితే... ఈ ఘటన ఈ నెల 14వ తేదీన జరిగినట్లు చెబుతున్నారని తెలుస్తోంది. బాధితులంతా కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే మృతిచెందినట్లు చెబుతున్నారు. ఇక.. రెస్టారెంట్ లోని సెకండ్ ఫ్లోర్ లో ఈ మృతదేహాలను గుర్తించినట్లు చెబుతున్నారు. జార్జియాలోని క్రిమినల్ కోడ్ ఆర్టికల్ 116 కింద పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని అంటున్నారు.
ఈ నేపథ్యంలొ... ప్రాథమిక విచారణ ప్రకారం ఇండోర్ ఏరియాలో పవర్ జనరేటర్ ను ఉంచారని.. బహుశా శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాన్ని బెడ్ రూమ్ దగ్గర మూసి ఉన్న స్థలం వద్ద అది ఆన్ చేయబడి ఉంటుందని అంటున్నారు. ఈ సమయంలో.. కచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి ఫోరెన్సిక్ టీమ్ రంగంలోకి దిగింది.