దేశంలో ఆకలి కేకలు.. మోడీ పాలనలోనే పెరిగాయంట!
దేశంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయని తాజాగా అంతర్జాతీయ మానవతావాదుల సర్వేల్లో స్పష్టమైనంది.
దేశంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయని తాజాగా అంతర్జాతీయ మానవతావాదుల సర్వేల్లో స్పష్టమైనంది. 2024-ఆకలి సూచీలో భారత్ 105వ స్థానం దక్కించుకుంది. మొత్తం దేశవ్యాప్తంగా 127 దేశాల్లో ఆకలి స్థితిగతులపై అధ్యయనం చేసిన నిపుణులు తాజాగా ఆకలి సూచీని విడుదల చేశారు. దీని ప్రకారం.. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ వంటి నిత్యం అనిశ్చితితో కొట్టుమిట్టాడే 42 దేశాల సరసన భారత్ చేరిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా భారత్‌లో గత పదేళ్ల కాలంలో ఆకలి చావులు, కేకలు పెరిగాయని వెల్లడించడం గమనార్హం.
నిజానికి గత పదేళ్లుగా దేశంలో మోడీ సర్కారే ఉంది. 2017 నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా ఆహార ధాన్యాలు కూడా అందిస్తు న్నారు. అయినప్పటికీ.. ఎక్కడా ఆకలి కేకలు తగ్గకపోగా.. మరింత పెరిగాయనిఈ సర్వే చెప్పడం గమనార్హం. పౌష్టికాహార లోపంతో ప్రజలు అల్లాడుతున్నారని తెలిపింది. 5 ఏళ్లవయసు వచ్చేలోగానే దేశవ్యాప్తంగా 8.9 శాతం మంది చిన్నారులు ఆకలి, పౌష్టికాహార లోపంతో కన్నుమూస్తున్నారని ఈ నివేదిక వివరించింది. అంతేకాదు.. భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటివి మెరుగ్గా ఉన్నాయని.. అక్కడ ఆకలి కేకలు తగ్గుముఖం పట్టాయని చెప్పడం గమనార్హం.
ఇక, డ్రాగన్ కంట్రీ చైనా అయితే.. ఆకలి కేకల నిర్మూలనలో ముందుందని ఈ నివేదిక పేర్కొంది. భారత్‌లో మాటలు.. ఆకలి కేకలను కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ఈ నివేదిక తప్పుబట్టింది. ``ఎంతో మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నామని చెబుతున్నా.. అవి బాధితులకు చేరుతున్నాయా? అనే విషయాన్ని గుర్తించడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి`` అని భారత్‌ను ఉద్దేశించి నివేదిక స్పష్టం చేసింది. ఈ పరిస్థితి వచ్చే రెండుమూడేళ్లలో మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
భారత్‌లో ఆకలి కేకలకు కారణాలు ఇవీ..
+ ఆకలి సూచీ చెప్పిన కారణాలను చూస్తే.. భారత్‌లో ఆహార వినియోగంపై ఆధ్యాత్మిక ప్రభావం ఎక్కువగా ఉంది.
+ కొన్ని ఆహార పదార్థాలపై నిషేధం
+ బాలింతలు, గర్భిణులకు సరైన ఆహారం అందడం లేదు.
+ పౌష్టికాహారం అందించడంలో అన్ని ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
+ ఆహార సముపార్జన మరింత ఖరీదైపోయింది.
+ ప్రాణాధార ఆహారాలపై పన్నుల ప్రభావం పడుతోంది.
+ ఎస్సీ, ఎస్టీలు తీసుకునే ఆహారంపై నియంత్రణ, కొన్ని ప్రాంతాల్లో నిషేధం ఉంది.