ఉభయ గోదావరుల్లో జనసేనకు ఇక టీడీపీ తలొగ్గాల్సిందే..!
ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ ఈ సారి భారీ విజయం నమోదు చేసుకుంది. జనసేన, టీడీపీలు క్లీన్ స్వీప్ చేశాయి.
ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ ఈ సారి భారీ విజయం నమోదు చేసుకుంది. జనసేన, టీడీపీలు క్లీన్ స్వీప్ చేశాయి. వైసీపీ గెలుస్తుందని అనుకున్న అన్ని స్థానాలను కూడా.. వీరు కైవసం చేసుకున్నారు. అసలు ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కలేదు. ఇలా ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయడానికి జనసేన ప్రధాన కారణమనే చర్చ సాగుతోంది. వాస్తవానికి 2014లోనూ టీడీపీ క్లీన్ చేసింది. అయితే.. అప్పటికి ఇప్పటికీ.. జనసేన తేడా కనిపిస్తోంది.
జనసేన బలంగా ఉండడంతోనే ఈ సారి క్లీన్ స్వీప్ సాధ్యమైందనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మం త్రి వర్గంలోనూ.. జనసేనకు అధిక ప్రాధాన్యం దక్కుతుందని అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా లోని మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన 5 చోట్ల పోటీ చేసి ఐదు కైవసం చేసుకుంది. రాజోలు నుంచి దేవ వరప్రసాద్, పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, పి. గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ విజయం దక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలో వీరిలో కనీసంలో కనీసం ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఆ మేరకు తమ్ముళ్లు వెనక్కి తప్పదని అంటున్నారు. ఇక, పశ్చిమ గోదావరి నుంచి కూడా..జనసేన విజయం దక్కించుకుంది. ఇక్కడి 15 అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల పోటీచేసి 6 సొంతం చేసుకుంది. భీమవరం పులపర్తి రామాంజనేయులు, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, నరసాపురం నుంచి బొమ్మిడి నారాయణ నాయకర్, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు నుంచి ధర్మరాజు పత్సమట్ల విజయం దక్కించుకున్నారు.
దీంతో పశ్చిమ గోదావరి నుంచి జనసేన కు ఎక్కువగానే మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసంలో కనీసం ఇక్కడ కూడా.. ఇద్దరి నుంచి ముగ్గురి వరకు మంత్రి పీఠాలు ఇవ్వాలి. దీంతో ఈ ప్రభావం టీడీపీ నాయకులపై పడనుంచి అలాకాదని జనసేనకు తక్కువ ఇస్తే.. క్షేత్రస్తాయిలో జనసేన ను పట్టించుకోవడంలేదనే వాదనవినిపించే అవకాశం కనిపిస్తోంది. సో.. ఎలా చూసుకున్నా.. ఈ సారి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ నేతలు.. కొంత మేరక వెనక్కి తగ్గక తప్పదని పరిణామాలు సూచిస్తున్నాయి.