టీడీపీకి మాజీ మంత్రి గుడ్ బై... కంచుకోటలో జనసేనకు బ్యాడ్ న్యూస్!!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి

Update: 2024-02-27 09:56 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా రకరకాల కారణాలతో పార్టీలు మారుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఒక మాజీమంత్రి సైకిల్ దిగిపోబోతున్నారంటూ ఒక కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం అటు టీడీపీలోనే కాదు ఇటు జనసేన, వైసీపీలోనూ హాట్ టాపిక్ గా మారింది.

అవును... రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అర్ధాంతరంగా టిక్కెట్ పోగొట్టుకుంటున్న నేతలు పార్టీలు మారుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని, నల్లగట్ల స్వామిదాసు, కేశినేని శ్వేత వంటి నేతలు ఫ్యాన్ కిందకు రాగా... వల్లభనేని బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయులు, కొలుసు పార్థసారథి వంటి వారు టీడీపీ-జనసేన కూటమివైపు కదిలారు. ఈ క్రమంలో తాజాగా టీడీపీలో మరో కీలక వికెట్ పడిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా గొల్లపల్లి సూర్యారావు.. ఫ్యాన్ కిందకు వెళ్లిపోబోతున్నారని తెలుస్తుంది.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి గుడ్ బై చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా అన్నీ అనుకూలంగా జరిగితే ఈరోజే తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వైఎస్ జగన్ ను కలుస్తారని అంటున్నారు. అదే జరిగితే.. గొల్లపల్లి వైసీపీలో చేరితే.. రాజోలుతో పాటు కోనసీమ జిల్లాలోని పలు కీలక నియోజకవర్గాల్లో లెక్కలు మారిపోతాయని అంటున్నారు పరీశీలకులు.

ఇందులో భాగంగా ఇక టీడీపీ - జనసేన కూటమికి చెప్పుకునే నాయకుడు ఉండరని.. పి.గన్నవరంలో కూడా టీడీపీకి బలం పోయినట్లే అని చెబుతున్నారు. కారణం... ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట టిక్కెట్ వస్తుందనే ఆశతో గొల్లపల్లి.. ఈ రెండు చోట్లా పట్టు సాధించారు. అయితే అనూహ్యంగా పి.గన్నవరం మహాసేన రాజేష్ కి ఇవ్వడం.. రాజోలు జనసేనకు అని చెప్పడంతో గొల్లపల్లి హర్ట్ అయ్యారని తెలుస్తుంది.

వాస్తవానికి కోనసీమ జిల్లాలో గొల్లపల్లికి ప్రధానంగా రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. అసలు కొండేటి చిట్టిబాబుకి వైసీపీ టిక్కెట్ దక్కకపోవడానికి గల కారణం కూడా... అక్కడ టీడీపీ నుంచి గొల్లపల్లి లాంటి బలమైన నేత ప్రత్యర్థిగా ఉంటారనే అని అంటుంటారు. అక్కడ టీడీపీ నుంచి గొల్లపల్లి పోటీ చేస్తే కొండేటికి తీవ్ర ఇబ్బందులు వచ్చేవని అంటుంటారు.! ఇదే సమయంలో రాజోలు నుంచి గొల్లపల్లి పోటీ చేసినా... రాపాకను అమలాపురం ఎంపీగా పంపె అవకాశాలున్నాయని అంటున్నారు!!

అయితే అనూహ్యంగా గొల్లపల్లి వైసీపీలోకి వస్తే... కచ్చితంగా రాజోలు ఎమ్మెల్యే టిక్కెట్ హామీ దక్కే అవకాశం ఉందనే భావించాలి. ఇక్కడ స్థానికంగా రాపాకపై వైసీపీలోనే కొంత వ్యతిరేకత ఉందంటూ కథనాలొస్తున్న వేళ... ఇది కీలక స్టెప్ అని అంటున్నారు. దీంతో... రాజోలు లో ఈ వార్త జనసేనకు బ్యాడ్ న్యూస్ అనే అంటున్నారు పరిశీలకులు!!

Tags:    

Similar News