బుచ్చయ్యకు మంత్రి పయ్యావుల ఫోన్... మేటర్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమంత్రి, పలువురు మంత్రులూ బాధ్యతలు స్వీకరించి బిజీ అయిపోయారు
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమంత్రి, పలువురు మంత్రులూ బాధ్యతలు స్వీకరించి బిజీ అయిపోయారు. ఎవరి ఛాంబర్స్ లో వారు కొలువుదీరారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పటికే వారి వారి జిల్లాల్లోనూ పర్యటించారు!
ఈ క్రమంలో ఈ నెల 21 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ల ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ సమయంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు.
అవును... టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి.. ఏపీ శాసన సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆయనను కేశవ్ ఓ కోరిక కోరారు. ఇందులో భాగంగా.. ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించాలని ఆయనను కోరారు. దీంతో... పయ్యావుల కేశవ్ ప్రతిపాదనకు బుచ్చయ్య చౌదరి అంగీకారం తెలిపారు.
దీంతో... ప్రొటెం స్పీకర్ గా గురువారం ఆయనతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీంతో ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు.
కాగా... టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తర్వాత అత్యధికంగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా బుచ్చయ్య చౌదరి గెలిచిన సంగతి తెలిసిందే. మరోపక్క మరో సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయ్యన్నపత్రుడు పేరు స్పీకర్ పదవికి ఖరారైన సంగతీ తెలిసిందే.