అంత కష్టమా..కన్నీరు పెట్టిన వైసీపీ మంత్రి...!
దాంతో భరత్ రాకను గుడివాడ స్వాగతించారు. అదే టైం లో పార్టీ సమావేశంలో కన్నీటి పర్యంతం అయ్యారు.'
వైసీపీ మంత్రి సీటు కూడా మార్పు చేర్పులలో పోయింది. అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి అసెంబ్లీ సీటుకు మలసాల భరత్ కుమార్ పేరును వైసీపీ అధినాయకత్వం ప్రకటించింది. దాంతో భరత్ రాకను గుడివాడ స్వాగతించారు. అదే టైం లో పార్టీ సమావేశంలో కన్నీటి పర్యంతం అయ్యారు.'
తనను అయిదేళ్ల పాటు ఆదరించారని, ఎమ్మెల్యేగా చేశారని, మంత్రిగా తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి పార్టీ నాయకులు కార్యకర్తల కృషి కారణం అని దాన్ని ఎన్నడూ మరవలేను అంటూ మంత్రి ఎమోషన్ అయ్యారు.
తనకు అనకాపల్లికి విడదీయరాని బంధం ఉంది అన్నారు. తాను రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగాను అంటే అదంతా క్యాడర్ పుణ్యమే అన్నారు. అందుకే రాజకీయాలు పదవులు పక్కన పెడితే తన గుండెలలో అనకాపల్లి ప్రజలు క్యడర్ ఉంటారని, అలాగే తాను కూడా మీ గుండెలలో ఉన్నాను అని అన్నారు.
ఇదిలా ఉంటే గుడివాడ మరోసారి అనకాపల్లి నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే సామాజిక వర్గ సమీకరణల వల్ల అది సాధ్యపడలేదు. ఒక బలమైన సామాజికవర్గం మంత్రిని ఎందుకో వ్యతిరేకిస్తోంది అన్న నివేదికలు ఆధారంగా ఆయనను అక్కడ నుంచి తప్పించారు,.
దాంతో పాజిటివ్ గానే గుడివాడ ఈ విషయం మీద రియాక్ట్ అయ్యారు. తనకు టికెట్ లేకపోయినా తాను వైసీపీ కోసం పనిచేస్తాను అని కూడా గుడివాడ చెప్పుకొచ్చారు. తనకు జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా తాను పనిచేస్తాను అని ఆయన అన్నారు. తనకు రాజకీయంగా గాడ్ ఫాదర్ వైఎస్ జగన్ అని ఆయన చెప్పారు.
ఇతర నాయకుల మాదిరిగా తాను పార్టీలో పదవులు లేకపోతే జెండా పీకేయను అని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే జగన్ కి ఎంతో ఇష్టుడైన ఈ యువ మంత్రి భవిష్యత్తు ఏంటి అన్నది చర్చకు వస్తోంది. అయితే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే చోడవరం ఎమ్మెల్యే సీటు గుడివాడకు ఇస్తారని అంటున్నారు.
అదే విధంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని ఎంపీగా అనకాపల్లి నుంచి పంపిస్తారు అని అంటున్నారు. మొత్తానికి గుడివాడ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇద్దరూ కూడా అనకాపల్లి సీటు కోసం గత కొన్నేళ్ళుగా ఇండైరెక్ట్ గా పార్టీలో పోరాటం చేసుకొచ్చారు.
ఇపుడు దాడి టీడీపీ తీర్ధం తిరిగి పుచ్చుకుంటే గుడివాడ ఏకంగా అనకాపల్లి రాజకీయాలకే స్వస్తి చెబుతున్నారు. మొత్తానికి రాజకీయం అంటే ఇదే అని అంతా అంటున్నారు. ఎవరికి ఏ పదవి ఎపుడూ శాశ్వతం కాదని మరోసారి రుజువు అయింది అని అంటున్నారు. ఇక మంత్రి గుడివాడ గాజువాక నుంచి పోటీ చేస్తే బెటర్ అని అంటున్నారు.
ఆయన సొంత గ్రామం మింది కూడా గాజువాక పరిధిలో ఉందని ఆయన తాత తండ్రి కూడా సొంత నియోజకవర్గాల నుంచే రాజకీయాలు చేశారని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా గుడివాడ రాజకీయంగా యువకుడని ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందని అందువల్ల తనకంటూ ఒక సీటు సొంతంగా ఉంచుకోవడమే ఆయన సుదీర్ఘ భవిష్యత్తుకు మేలు చేస్తుంది అని అంటున్నారు.