టీడీపీ కోసం "ప్రతినిధి"... గుడివాడలో పోటీ?

అవును... హీరో నారా రోహిత్ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ఒక ఆసక్తికర చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది.

Update: 2023-08-01 13:30 GMT

"బాణం" సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన నారా రోహిత్... అనతికాలంలోనే రొటీన్ కి భిన్నంగా సినిమాలు తీస్తారనే పేరు సంపాదించుకున్న సంగెతి తెలిసిందే. ఈ క్రమంలో "ప్రతినిధి" సినిమాలో రోహిత్ లేవనెత్తిన ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.. సమాన్యుల్లో కొత్త ఆలోచనలు రేపాయి. ఈ నేపథ్యంలో తాజాగా రోహిత్ గురించిన ఆసక్తికర విషయం ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.

అవును... హీరో నారా రోహిత్ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ఒక ఆసక్తికర చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. ఆ చర్చ ప్రకారం... రోహిత్ రాజకీయాల్లోకి రాబోతున్నారని.. 2024 ఎన్నికల్లో టీడీపీ తరుపున గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతోన్నారని విషయాలు వైరల్ అవుతున్నాయి. కారణం... ఈసారి గుడివాడలో టీడీపీ తరుపున పోటీ చేయడానికి ఫుల్ ఛరిష్మా ఉన్న నేత అవసరం ఉంది.

ఈ సమయంలో చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ అయితే సరైన వ్యక్తి అని భావిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. పైగా ఈసారి అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో.. గుడివాడలో టీడీపీ జెండా ఎగరెయ్యడం కూడా అంతే ముఖ్యమని టీడీపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. దీంతో నారా రోహిత్ పేరు తెరపైకి వచ్చిందని సోషల్ మీడియాలో విషయం వైరల్ అవుతోంది.

అయితే... తాజాగా తెలిసిన విషయాల ప్రకారం... నారా రోహిత్ కు ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని తెలుస్తుంది. తనకు ప్రస్తుతానికి సినిమాలే ఫస్ట్ ప్రియారిటీ అని రోహిత్ చెబుతున్నారని సమాచారం. అయితే... పెదనాన్న ఏమి చిబితే అది, ఎలా చెబితే అలా పార్టీకోసం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెబుతున్నారంట రోహిత్.

దీంతో రోహిత్ కి రాజకీయాలపై ఆసక్తి ఉంది కానీ... అప్పుడే కాదు అన్నమాట అని ఒక కన్ క్లూజన్ కి వస్తున్నారు నెటిజన్లు. మరి నారా రోహిత్ ఇలా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాల్లోనే తనదైన ముద్ర వేసుకుంటూ విభిన్నమైన చిత్రాలకు "ప్రతినిధి"గా ఉంటారా.. లేక, ఆయన పెదనాన్న కోరితే గుడివాడలో కదం తొక్కుతారా.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల "ప్రతినిధి"గా మారతారా అనేది వేచి చూడాలి!

కాగా... ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గం టీడీపీ కంచుకోట అనే విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఇక్కడ్నుంచే 1983, 1985 ల్లో రెండుసార్లు పోటీచేసి గెలిచారు.

అనంతరం 1989లో కాంగ్రెస్ గెలిచింది. అప్పట్నుంచీ 1994, 1999, 2000 ఉపఎన్నిక, 2004, 2009 వరకూ నాన్ స్టాప్‌ గా టీడీపీ జెండా ఎగిరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని... 2014, 2019లో ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి గెలిచారు.

టీడీపీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో పసుపు జెండా ఎగరనివ్వాలని తమ్ముళ్లు కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నారా రోహిత్ పేరు సోషల్ మీడియా వేదికగా తెరపైకి వచ్చింది!!

Tags:    

Similar News