‘పవన్ ను వెంటనే డిస్మిస్ చేయాలి’.. మాజీ ఎంపీ తాజా డిమాండ్!

తిరుమల లడ్డూ వ్యవహారం ఇప్పుడు ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-25 06:18 GMT

తిరుమల లడ్డూ వ్యవహారం ఇప్పుడు ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన ఆయన తిరుమల లడ్డూ విషయంలో హిందువులంతా రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు.

సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని.. దాన్ని కాపాడటానికి అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు పవన్ వివరించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పవన్ హిందువులంతా రోడ్లపైకి రావాలన్నట్లుగా పవన్ వ్యాఖ్యానించారు. దీంతో.. ఈ వ్యాఖ్యలను పూర్తిగా తప్పుపడుతూ.. పవన్ ని డిస్మిస్ చేయాలని కోరుతున్నారు మాజీ ఎంపీ!

అవును... తిరుమల లడ్డూ విషయంలో హిందువులంతా రోడ్లపైకి రావాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదని.. అవి పూర్తిగా రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ మండిపడ్డారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. తాజాగా మాట్లాడిన ఆయన... ఉపముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా రెచ్చగొట్టే తరహా వ్యాఖ్యలు చేస్తే వెంటనే అతడిని డిస్మిస్ చేయాలని హర్ష కుమార్ అన్నారు.

ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పెద్ద భజనదారుడు అయిపోయాడని అన్నారు. గతంలో పుష్కరాల సమయంలో చంద్రబాబు ఫోటో పిచ్చి వల్ల షూటింగ్ ప్లాన్ చేస్తే సుమారు 30 మంది చనిపోయారని హర్ష కుమార్ చెప్పుకొచ్చారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటిని నియంత్రించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలని అన్నారు.

అయితే ఏపీ ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలేమి చేయకుండా... వారదలు వచ్చేసిన, జనాలు ఇబ్బందులు పడిన తర్వాత నీటిలో నడిచి, పడవల్లో తిరిగి నాటకాలు ఆడారని అన్నారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 అని పథకాలు హామీలు ఇచ్చారని.. హామీలు ఇవ్వడం కాదు అమలు చేయాలని తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశాడని అన్నారు. అదే ప్రామిస్ చేసిన కూటమి ఎందుకు ఆ హామీని నెరవేర్చ లేకపోతుంది.. నెరవేర్చ లేనప్పుడు దొంగ ప్రామిస్ లు చేసి ఎందుకు అధికారంలోకి వచ్చారు అని హర్ష కుమార్ నిలదీశారు. వీటిని పక్కదారి పట్టించేందుకే తిరుమల నెయ్యి టాపిక్ తెచ్చారని ఫైరయ్యారు!

Tags:    

Similar News