యూఎస్ హెచ్-1బీ వీసా పునరుద్ధరణకు వైట్ హౌస్ ఓకే!
కొన్ని కేటగిరీల హెచ్-1బీ వీసాలను దేశంలోనే రెన్యువల్ చేసుకునే విధంగా అమెరికా ఇటీవల ఓ పైలట్ ప్రోగ్రాం ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
కొన్ని కేటగిరీల హెచ్-1బీ వీసాలను దేశంలోనే రెన్యువల్ చేసుకునే విధంగా అమెరికా ఇటీవల ఓ పైలట్ ప్రోగ్రాం ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కార్యక్రమం మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుందని అమెరికా విదేశాంగ వెల్లడించింది. హెచ్-1బీ వీసా పునరుద్ధరణ విధానాన్ని మరింత సరళీకరించేం కార్యక్రమాల్లో భాగంగా దీన్ని చేపట్టినట్లు తెలిపింది. అయితే తాజాగా ఈ పైలట్ ప్రోగ్రాంకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది.
అవును... ప్రధానంగా భారతీయ నిపుణులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, హెచ్-1బీ వీసా హోల్డర్లు.. అమెరికా నుంచి బయటకు వెళ్లకుండానే వీసాలను పునరుద్ధరించడానికి అనుమతించే పైలట్ ప్రోగ్రాం కు వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ సమీక్షను ఆమోదించింది. దీంతో సుమారు 20,000 మంది హెచ్-1బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్కర్లు వచ్చే ఏడాది జనవరి నుండి తమ వీసాలను పునరుద్ధరించుకోగలరు!
ఈ ఏడాది జూన్ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూఎస్ పర్యటన సందర్భంగా కొన్ని కేటగిరీల హెచ్-1బీ వీసాల దేశీయ పునరుద్ధరణ కోసం వైట్ హౌస్ పైలట్ ప్రోగ్రాంను ప్రకటించిన కొన్ని నెలల తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇది ఇది వీసా హోల్డర్ లు తమ వీసాల పునరుద్దరణ కోసం దేశం దాటాల్సిన అవసరం లేకుండా... స్టేట్ డిపార్ట్‌మెంట్ కు మెయిల్ చేయడం ద్వారా పునరుద్ధరించుకోవడానికి అనుమతిస్తుంది.
ప్రధానంగా హెచ్-1బీ వీసా హోల్డర్లకు అతిపెద్ద వనరు అయిన భారత్ వంటి దేశాల్లో, అధిక వీసా నిరీక్షణ సమయాలు ఆయా ఉద్యోగులతోపాటూ వారి వారి కంపెనీల పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో... ఈ సరికొత్త నిర్ణయం ఇరువర్గాలకు పెద్ద ఉపశమనం అని అంటున్నారు. కారణం... ఒక సంవత్సరంలో మంజూరైన హెచ్-1బీ వీసాలో సుమారు 75 శాతం ఇండియాకు చెందినవారికే వెళుతుందని అంచనా వేయబడింది!
కాగా.. హెచ్-1బీ వీసా పునరుద్ధరణ విధానాన్ని మరింత సరళీకరించే కార్యక్రమాల్లో భాంగా... కొన్ని కేటగిరీల హెచ్-1బీ వీసాలను దేశీయంగానే రెన్యువల్ చేసుకునేలా చర్యలకు అగ్రరాజ్యం డిశెంబర్ మొదటివారంలోనే ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం 3 నెలల పాటు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
అయితే, ఇది కేవలం నిపుణులకు మాత్రమేనని వర్తిస్తుందని.. ఆయా నిపుణుల కుటుంబీకులకు కానీ, వారిపై ఆధారపడిన వారికి కానీ ఇది వర్తించదని యూఎస్ తెలిపింది. ఈ క్రమంలో తాజాగా ఈ పైలట్ ప్రోగ్రాం కు వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ సమీక్షను ఆమోదించింది.