హ‌రీష్‌రావు.. ఔరంగ‌జేబు : సీఎం రేవంత్

అలాంటి హ‌రీష్ రావు.. మ‌రో ఔరంగ‌జేబు కాకపోతే.. మ‌రేంటి? అని వ్యాఖ్యానించారు.

Update: 2024-02-15 14:08 GMT

బీఆర్ ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హ‌రీష్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హ‌రీష్ రావును ఔరంగ‌జేబుతో పోల్చారు. ``ప‌దేళ్లు మంత్రిగా ఉన్న హ‌రీష్‌రావు.. ఏం చేశాడు. ఉద్యోగుల‌కు మేలు చేశాడా? రైతుల‌కు మేలు చేశాడా? ఈ రాష్ట్రానికి మేలు చేశాడా?`` అని సీఎం రేవంత్ ప్ర‌శ్నించారు. అలాంటి హ‌రీష్ రావు.. మ‌రో ఔరంగ‌జేబు కాకపోతే.. మ‌రేంటి? అని వ్యాఖ్యానించారు.

వివాదం ఏంటంటే..

నిన్నటి వ‌ర‌కు హ‌రీష్‌రావును కేవలం మాట‌ల‌తో ఎదురు దాడి చేసిన సీఎం రేవంత్ అనూహ్యంగా ఈ రోజు.. టార్గెట్ చేశారు. దీనికి కార‌ణం.. మేడిగ‌డ్డ‌. ఈ ప్రాజెక్టు కుంగిపోయేందుకు రెడీ ఉంద‌ని.. బీట‌లు ఇచ్చింద‌ని.. ఇలాంటి దానిలోకి నీటిని ఎలా పారిస్తార‌ని.. సీఎం రేవంత్ స‌భావేదిక‌గా ప్ర‌శ్నించారు. అలా పారిస్తామ‌నే మొన‌గాళ్లు ముందుకు రావాల‌ని అన్నారు. దీనికి స‌మాధానంగా హ‌రీష్‌రావు కూడా.. రెచ్చి పోయారు. ``మీరు రాజీనామా చేయండి.. మేం వ‌చ్చి.. నీళ్ల‌ను ఎలా పారిస్తామో చూడండి`` అని వ్యాఖ్యానిం చారు.

హ‌రీష్ రావు చేసిన వ్యాఖ్య‌ల‌పై సీఎం రేవంత్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ``మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. నువ్వు రాజీనామా చెయ్ నేను చేసి చూపిస్తా అని హరీష్ అంటుండు. హరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నాడు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుది. పదేళ్లు మంత్రిగా ఉండి హరీష్ ఏం చేశారు? మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిండ్రు`` అని రేవంత్ దుమ్మెత్తి పోశారు.

Tags:    

Similar News