7 మండలాలపై 10 ఏళ్లలో పీకిందేంటి హరీశా?

తాజాగా ఏడు మండలాల మీద మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల్నే తీసుకుంటే.. ఆయన ఇప్పుడు రేవంత్ సర్కారుకు డెడ్ లైన్ విధిస్తున్నారు.

Update: 2024-07-04 14:30 GMT

ఒకటి తర్వాత ఒకటిగా వచ్చి పడుతున్న ఓటముల్ని జీర్ణించుకోలేక సతమతమవుతోంది గులాబీ పార్టీ. వరుస పెట్టి వచ్చిన విజయాలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచటమే కాదు.. ఆత్మవిశ్వాసం సైతం వారి ముందు చిన్నబోయిన పరిస్థితి కొంతకాలం క్రితం ఉండేది. ఎంత విజయాలు అదే పనిగా వచ్చి పడితే మాత్రం.. మరీ ఇంత ధీమా ఏంటి? అంటూ విస్మయానికి గురైనోళ్లు ఉన్నారు. సీనియర్.. జూనియర్ అన్న తేడా లేకుండా నోటికి వచ్చినట్లుగా పని చెప్పిన దానికి తగ్గట్లు.. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలైన పరాజయాల పరంపర అంతకంతకూ విస్తరిస్తోందే తప్పించి తగ్గట్లే. ఇవి సరిపోవన్నట్లు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు ఆ పార్టీని మరింతగా ఇబ్బంది పెడుతోంది.

ఓవైపు ప్రజల్లో ఆదరణ కోల్పోవటం.. మరోవైపు గతం తాలుకూ తప్పులు వెంబడిస్తూ.. వెంటాడుతున్నాయి. ఎంతలా విడిపించుకుందామనుకున్నా.. వదలని పరిస్థితి నెలకొంది. ఇలాంటి వేళ.. కొత్త తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అదే సమయంలో.. పాత తప్పుల్ని వీలైనంత త్వరగా కవర్ అయ్యేలా చూసుకోవాల్సి ఉంది. కానీ.. అలాంటి ధోరణి బీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో కనిపించని పరిస్థితి.

తాజాగా ఏడు మండలాల మీద మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల్నే తీసుకుంటే.. ఆయన ఇప్పుడు రేవంత్ సర్కారుకు డెడ్ లైన్ విధిస్తున్నారు. ఏపీలో విలీనమైన ఏడు మండలాల్ని వెనక్కి తీసుకురావాలని అడుతున్నారు. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం మోడీతో సంబంధాలు అంత బాగాలేని వేళలోనే.. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలంటే ఏడు ముంపు మండలాల్ని ఏపీలో కలిపితే తప్పించి సాధ్యం కాదని అల్టిమేటం విధించిన నేపథ్యాన్ని మర్చిపోకూడదు.

Read more!

ఏడు మండలాల మీద పలుమార్లు కేసీఆర్ కు సైతం చికాకులు ఎదురయ్యాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో.. అదే పనిగా ఏడు మండలాల మీద ప్రశ్నలు అడగటం.. వాటికి సమాధానం చెప్పలేక ఇబ్బందులకు గురయ్యేవారు. ఇలాంటి ఒక సందర్భంలో.. ఏడు మండలాల గురించి మాట్లాడొద్దని.. ఒకసారి కేంద్రం నిర్ణయించి.. ఏడు మండలాల్ని ఏపీలో కలిపేందుకు డిసైడ్ అయిన తర్వాత.. వాటి మీద ఆశలు వదులుకోవటం మంచిదని కేసీఆరే స్వయంగా వ్యాఖ్యానించారు. అలాంటిది.. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు హరీశ్ రావు సీన్లోకి వచ్చి.. ఏడు విలీన మండలాల్ని వెనక్కి తీసుకువాల్సిందేనంటూ పట్టుబట్టటంలో అర్థముందా? అన్నది ప్రశ్న.

నిజానికి 7 మండలాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ తిట్లు తినే పరిస్థితి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే ఉంటుంది. గులాబీ పార్టీ సారథ్యంలోని సర్కారు ఉన్నప్పుడే ఏడు మండలాలు ఏపీలో విలీనమైనప్పుడు.. ఇన్నేళ్ల తర్వాత ఏపీ నుంచి తీసుకొచ్చి తెలంగాణలోకి కలపటం అన్నది సాధ్యమయ్యే అవకాశమే లేదు. రాజకీయం కోసం హరీశ్ లాంటోళ్లు ప్రస్తావించి.. కాస్తంత ఆలజడి క్రియేట్ చేసే ప్లానింగ్ ఉంటే.. మొదటగా ఇరుకున పడేది కేసీఆర్ మాత్రమే అవుతారు. రేవంత్ సర్కారును ఇరుకున పెట్టేందుకు ఏడు మండలాల ప్రస్తావన తెస్తే.. తమకే రివర్సులో తిప్పలు ఎక్కువ అవుతాయన్న వాస్తవాన్ని హరీశ్ గ్రహిస్తే మంచిది. హరీశ్ మాత్రమే కాదు.. ఆయన తరహాలో ఆలోచించే బీఆర్ఎస్ నేతలు కాస్తంత తెలివిగా వ్యవహరిస్తే సరి. లేదంటే.. కేసీఆర్ అండ్ కోకే మరిన్ని తిప్పలు తప్పనట్లే.

Tags:    

Similar News

eac