లిక్కర్ పార్టీ వివాదంలో చిక్కుకున్న బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్!
బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ షేక్.. బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో వరుసగా రేవ్ పార్టీల వ్యవహారాలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. పబుల్లో, అపార్ట్మెంట్స్ లో, హోటల్స్ లో... ఇటీవల కాలంలో హైదరాబాద్ సిటీలో ఈ ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ షేక్.. బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది.
అవును... హైదరాబాద్ సిటీలో మరో రేవ్ పార్టీ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ షేక్.. బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు కాంటినెంట్ రిసార్ట్స్ లో ఈ పార్టీ జరిగిందని.. ఇందులో బుల్లితెర నటులు, పలువురు సెలబ్రెటీలు హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు!
ఈ సందర్భంగా అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించినందుకు మహబూబ్ తో పాటు పార్టీ ఆర్గనైజర్, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుశాపూర్ లోని కాంటినెంట్ రిసార్ట్ ఓనర్ పైనా పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఘటన జూలై 29నే జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది.
ఇక ఈ పార్టీలో 11.2 లీటర్ల లిక్కర్, 7.15 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... బాలంటైన్స్ విస్కీ ఫుల్ బాటిల్స్ మూడు, అబ్సోలట్ సిట్రాన్ వొడ్కా ఫుల్ బాటిల్లు ఐదు, ఒక లీటర్ బ్లాక్ లేబుల్ విస్కీ, బడ్వైజర్ బీర్స్ 11, బ్రీజర్స్ 19 స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు.
కాగా... రేవ్ పార్టీల్లో చాలా రకాలు ఉంటాయి. ఇందులో భాగంగా... స్టివల్ రేవ్స్, అండర్ గ్రౌండ్ రేవ్స్, క్లబ్ రేవ్స్, థీమ్ బేస్డ్ రేవ్స్, డే రేవ్స్, సైలెంట్ డిస్కో రేవ్స్, సైట్రాన్స్ రేవ్స్, హోర్డ్ స్టీల్ రేవ్స్ అంటూ రకరకాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే... ఏ పార్టీ అయినా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా పలువురు కలిసి చేసుకునే లిక్కర్ సహిత పార్టీలను రెవ్ పార్టీలుగానే భావిస్తారని తెలుస్తోంది.
అంటే... బర్త్ డే పార్టీ చేసుకోవడం నేరం కాదు కానీ... ఆ బర్త్ డే పార్టీలో పలువురు కలిసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోకుండా, అనుమతి తీసుకున్నప్పటికీ.. తీసుకున్న అనుమతి పరిమితికి మించి లిక్కర్ పార్టీ చేసుకుంటే దాన్ని రేవ్ పార్టీగా భావించి పోలీసులు పలు సెక్షన్స్ కింద అదుపులోకి తీసుకుంటారని అంటున్నారు. ఇలాంటి పార్టీలకు అనుమతులు కంపల్సరీ!!