పాలపుంతలో మరో మహాద్భుతం.. అతి పెద్ద బ్లాక్ హోల్ గుర్తింపు!
మిల్కీవేవ్(పాలపుంత)లో అనేక నక్షత్రాలు, ద్రవ్యరాసులు ఉన్న విషయం తెలిసిందే.
మిల్కీవేవ్(పాలపుంత)లో అనేక నక్షత్రాలు, ద్రవ్యరాసులు ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ భూమి పుట్టుక, సృష్టి పుట్టుక వంటిఅనేక రహస్యాలకు కూడా ఈ పాలపుంతే కేంద్రంగా ఉంది. ఇలాంటి పాలపుంతలో మరో మహాద్భుతం తెరమీదికి వచ్చింది. అతిపెద్ద బ్లాక్‌హోల్‌ను(ఇప్పటి వరకు కనుగొన్న వాటి కంటే కూడా) వాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి `గయ బీహెచ్3` గా పేరు పెట్టారు.
ఎంత ఉంటుంది?
తాజాగా గుర్తించిన ఈ అతి పెద్ద బ్లాక్ హోల్... సూర్యుడి ద్రవ్యరాశికన్నా.. 33 నుంచి 34 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు రష్యాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక, ఈ భూమిపై నుంచి ఈ కొత్త బ్లాక్ హోల్ ఏకంగా.. 2 వేల కాంతి సంవత్సరాలు ఉంటుందన్నారు. (ఒక కాంతి సంవత్సర దూరం అంటే.. కాంతి సుమారుగా ఒక సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ఒక సంవత్సరం పాటు శూన్యంలో ప్రయాణించిన దూరమే ఒక కాంతి సంవత్సరం). ప్రస్తుతం యూరోపియన్ దేశాలతో కలిసి రష్యా.. ఖగోళ పుట్టుకపై అనేక పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలకే `గయా మిషన్` అని పేరు పెట్టారు.
ఎలా గుర్తించారు?
రష్యా చేపట్టిన ఖగోళ పరిశోధనల్లో కొంత డేటాను సేకరించారు. ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? నక్షాలు ఎన్ని.. ఖగోళంలో ఏం జరుగుతోంది అనే విషయాలను పరిశీలిస్తున్నారు. దీనిని విశ్లేషిస్తున్న సమయంలో పరిశోధకు డు పాస్కల్ పనుజ్ఞో ఈ అతి పెద్ద బ్లాక్ హోల్‌ను గుర్తించారు. అస్థిరంగా కదులుతున్న ఓ నక్షత్రాన్ని గుర్తించే క్రమంలో దాని పక్కనే ఉన్న బ్లాక్ హోల్ బయటపడడం గమనార్హం.