దేశంలోనే ఫ‌స్ట్‌: హిజ్రాల కోసం హెల్ప్ లైన్‌

ఏపీలోని ఉమ్మ‌డి కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా.. ఈ హిజ్రాల హెల్ప్‌లైన్‌ను తాజాగా ప్రారంభించారు.

Update: 2023-08-15 00:30 GMT

దేశంలో ఎక్క‌డైనా.. మ‌హిళ‌ల కోసం.. చిన్నారుల కోసం.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఎదురైతే అన్ని వ‌ర్గాల‌ ప్ర‌జ‌ల కోసం ఆయా డిపార్ట్‌మెంట్ల నుంచి హెల్ప్‌లైన్లు ఉన్నాయి. ముఖ్యంగా, పోలీసు, ఫైర్ స‌ర్వీసుల గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే, దేశంలోనే తొలిసారిగా ఏపీలో హిజ్రాల కోసం హెల్ప్‌లైన్ ప్రారంభించారు. ఇక‌, నుంచి హిజ్రాల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌ని.. వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుం టామ‌ని ఈ సంద‌ర్భంగా పోలీసులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఏపీలోని ఉమ్మ‌డి కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా.. ఈ హిజ్రాల హెల్ప్‌లైన్‌ను తాజాగా ప్రారంభించారు. ''స్వాభిమా న్ ట్రాన్స్ జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ హెల్ప్ లైన్ 1091'' పేరుతో హెల్ప్‌లైన్‌ను తీసుకువ‌చ్చారు. ఏపీ సీఐడీ ఆధ్వ‌ర్యంలో 'స్వాభిమాన్ ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్' కేసులు ప‌రిశీలించ‌నున్నారు. కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న అన్ని సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్లలోనూ ఈ హెల్ప్‌లైన్ అందుబాటులోకి రానుంది.

పోలీసుల వెర్ష‌న్ ఇదీ..హిజ్రాల ప్రొటెక్ష‌న్ కు హెల్ప్‌లైన్ తీసుకురావ‌డం వెనుక పోలీసుల వెర్ష‌న్ ఏంటంటే.. స‌మాజంలో లింగ వివక్షను అంతం చేసి, లింగమార్పిడి వ్యక్తుల యొక్క భద్రత, వారి యొక్క గౌరవాన్ని కాపాడ‌డం. హిజ్రాల‌పై జరుగుతున్న శారీరక హింసతో సహా వారిపై ఉన్న వివక్షను నిరోధించడం వారి హక్కులను పరిరక్షించడం వారిపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించడం వంటివి ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు ఉద్దేశమ‌ట‌.

ఈ హెల్ప్ లైన్ ద్వారా ఎవరైతే ట్రాన్స్ జెండర్స్ వివక్షకు గురవుతున్నారో, సమాజపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు ఫిర్యాదు చేసి తగిన న్యాయం పొందవచ్చన్న‌ది పోలీసులు తెలిపిన విష‌యం.

Tags:    

Similar News