హెచ్ బొల్లాకు ఘోరీ కట్టటం ఇజ్రాయెల్ కు సాధ్యమేనా?

దెబ్బ కొట్టటం వరకు బాగానే ఉంటుంది. దెబ్బ తిన్నోడు ఊరుకోడు కదా? ఏదోలా దెబ్బ తీద్దామనే అనుకుంటాడు.

Update: 2024-09-30 04:28 GMT

దెబ్బ కొట్టటం వరకు బాగానే ఉంటుంది. దెబ్బ తిన్నోడు ఊరుకోడు కదా? ఏదోలా దెబ్బ తీద్దామనే అనుకుంటాడు. ఇది సాదాసీదా వాళ్లు చేసే పని. అలాంటిది హెజ్ బొల్లా లాంటి కరడుకట్టిన సంస్థకు చెందిన చీఫ్ ను.. సీనియర్ కమాండర్లు హతమైన వేళ.. ఆ సంస్థకు సంబంధించిన రివేంజ్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు కొత్త టెన్షన్ గా మారింది. తమను చావుదెబ్బ తీసిన ఇజ్రాయెల్ సంగతి చూసేందుకు సదరు సంస్థ తహతహలాడుతోంది.

మిగిలిన సంస్థలకు హెజ్ బొల్లాకు తేడా ఏమంటే.. వీరి వద్ద ప్రపంచంలోని పలు దేశాలకు లేని ఆయుధాలు వీరి వద్ద ఉన్నాయి. క్షిపణులు.. రాకెట్లు మాత్రమే కాదు సునిశిత శిక్షణ పొందిన వేలాది మంది ఫైటర్లు ఉన్నారు. తమ చీఫ్ ను హతమార్చిన వైనంపై హెజ్ బొల్లా తీవ్రంగా రగిలిపోతుంది. అంతకంతకూ బదులు తీర్చుకోవాలని తపిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇజ్రాయెల్ మీద స్వల్ప స్థాయిలో రాకెట్లను ప్రయోగిస్తున్నారు. ఈ దాడులకు ఇజ్రాయెల్ స్పందించి.. ఎదురు దాడికి పాల్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అదే సమయంలో చావుదెబ్బ తీసిన హెజ్ బొల్లాను పూర్తిగా క్లియర్ చేయటం.. వారి అనవాళ్లు లేకుండా చేయటం అంత తేలికైన విషయం కాదు. నిజానికి ఇజ్రాయెల్ ఈ లక్ష్యాన్ని సాధించేందుకు పలు ప్రయత్నాలు చేసినా.. ఆశించినంత ఫలితం రాని పరిస్థితి. హెజ్ బొల్లా చేస్తున్న దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ రెచ్చిపోతే ప్రపంచ శాంతిపై ప్రభావం చూపటం ఖాయమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

హెజ్ బొల్లాను పూర్తిగా నిర్మూలించేందుకు ఇజ్రయెల్ గతంలో పలు ప్రయత్నాలు చేపట్టాయి. కానీ.. ఆశించినంత ఫలితం రాలేదు. 1978 నుంచి పలుమార్లు లెబనాన్ మీద దాడి చేసినా.. దిగ్బంధించినా పెద్ద ఫలితం రాలేదు. ఏడాదిగా హమస్ మీద పోరు చేస్తున్నప్పటికి సానుకూల ఫలితం అంత తేలికైన విషయం కాదు. గెరిల్లా యుద్దంతో విజయం అంత తేలికైనది కాదన్నది తెలిసిందే. హెజ్ బొల్లా.. హమస్ .. హౌతీ తదితర గ్రూపులకు ఇరాన్ అండ ఎక్కువ. కానీ.. ఇజ్రాయెల్ మీద నేరుగా యుద్దం చేసేందుకు ఇరాన్ సిద్దంగా లేదు.

ఒకవేళ ఇరాన్ తో యుద్ధం ముదిరితే మాత్రం.. ఇజ్రాయెల్ అణ్వాయుధాల్ని బయటకు తీసే వీలుంది. అదే జరిగితే.. ఇరాన్ సైతం అణ్వాయుధాల తయారీకి దగ్గర్లో ఉందని చెబుతారు. ఈ రెండు దేశాల మధ్య ఎవరు దూకుడుగా వ్యవహరించినా దానికి జరిగే నష్టం భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు కొంతకాలం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అయితే.. వైమానిక దాడులకు అవకాశం ఉందంటున్నారు.

అంతేకాదు హెజ్ బొల్లాకు చెందిన అత్యంత రహస్య యూనిట్ ‘‘బ్లాక్ యూనిట్ (షాడో యూనిట్, యూనిట్ 910)’’ రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదుల్ని ఈ యూనిట్ టార్గెట్ చేసుకోవచ్చన్న మాట బలంగా వినిపిస్తోంది. 32 ఏళ్ల క్రితం నాటి హెజ్ బల్లా నేత అబ్బాస్ అల్ ముసావిని ఇజ్రాయెల్ దళాలు చంపిన వేళలో ఈ యూనిట్ ప్రతీకార దాడి చేసింది. హెజ్ బొల్లా వద్ద ఉన్న అత్యంత రహస్య.. ప్రమాదకర యూనిట్లలో దీన్ని ఒకటిగా పేర్కొంటారు.

ఈ విభాగానికి హమియాఅలియాస్ అబు జాఫర్ నాయకత్వం వహిస్తారని చెబుతారు. ఇరాన్ కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కోర్ తో కలిసి పని చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనికి టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని చెబుతారు. ఇటీవల కాలంలో అమెరికాలోని జేకేఎఫ్ ఎయిర్ పోర్టుపై దాడికి ప్లాన్ సిద్ధం చేసింది. చివరి నిమిషంలో దానిక ఆపరేటివ్ అలీ కౌరానిని అరరెస్టు చేయటంతో అమెరికా.. ఇజ్రాయెల్ పై హెజ్ బొల్లా కుట్ర బయటకు వచ్చినట్లుగా చెబుతారు. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఇజ్రాయెలీలపై కత్తి కట్టినట్లుగా దాడులకు పాల్పడటం ద్వారా.. తమ ప్రతీకారాన్ని తీర్చుకునే వీలుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News