దేశంలో అధిక ద్రవ్యోల్బణంతో అతలాకుతలం
ఏదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు అన్ని దేశాలు ద్రవ్యోల్బణం బారిన పడి కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో వస్తువుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి.
ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్య ద్రవ్యోల్బణం. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్ ఇలా పలు దేశాల్లో ద్రవ్యోల్బణం సమస్య అతలాకుతలం చేస్తోంది. ధనిక, పేద దేశాలనే తేడా లేకుండా ద్రవ్యోల్బణం నిరంతరం ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. ఏదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు అన్ని దేశాలు ద్రవ్యోల్బణం బారిన పడి కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో వస్తువుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి.
కూరగాయలు, నిత్యావసర సరుకులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా సామాన్యుడి బతుకు చిద్రమవుతోంది. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులమయం అవుతున్నాయి. దీని నుంచి గట్టెక్కడానికి పలు చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు కనిపించడం లేదు. ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం సమస్యతో సతమతమవుతున్నాయి.
వెనుజులాలో ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం 318 శాతం ఉంది. లెబనాన్ లో 215, అర్జెంటీనాలో 143, సిరియాలో 79.1, పాకిస్తాన్ లో 29.2, భారత్ లో 4.87 శాతం ద్రవ్యోల్బణం నమోదైనట్లు తెలుస్తోంది. ఇంకా టర్కీలో 61, ఈజిప్టులో 35.8, నైజీరియాలో 27.33, కజకిస్తాన్ లో 10.3, బంగ్లాదేశ్ లో 9.93, రుమేనియాలో 8.07, హంగేరీలో 7.9, కెన్యాలో 6.8, రష్యాలో 6.7, పోలాండ్ లో 6.5, స్వీడన్ లో 6.5, దక్షిణాఫ్రికాలో 5.9, ఆస్ట్రేలియాలో 5.4, ఆస్ట్రియాలో 5.4, ఐర్లండ్ లో 5.1, ఫిన్లాండ్ లో 4.9 శాతం మేర ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
దేశాల విధానాల వల్లే ద్రవ్యోల్బణం సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు. ఈనేపథ్యంలో ద్రవ్యోల్బణం బారి నుంచి బయట పడటానికి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ప్రజల జీవితాల్లో కూడా మార్పు రావడం లేదు. ఉచిత పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి. దీంతో అప్పుల భారం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. భవిష్యత్ లో ఈ సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ద్రవ్యోల్బణం వల్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో ఉండటం లేదు. వారి సంపాదన ఎటు చాలడం లేదు. ధరలు నియంత్రణలో ఉంటే సామాన్యుడి ఆదాయం పెరుగుతుంది. కానీ ధరలు అదుపులో లేకుంటే బతుకు దుర్భరమే. ఈనేపథ్యంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు.