లెజెండ్ ఫ్లైట్ @ ముంబై... హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణల అప్ డేట్ ఇదే!

దీంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో అందులో ప్రయాణికులను ఫ్రాన్స్ అధికారులు విచారించారు.

Update: 2023-12-26 09:28 GMT

లెజెండ్ సంస్థకు చెందిన ఓ విమానం గత వారం 300 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి నికరాగువాకు బయల్దేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ విమాన ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇలా మానవ అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం అందడంతో ఆ విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు నిలిపివేశారు. ఈ సమయంలో ఆ విమానాన్ని ఇండియాకు పంపించడం గమనార్హం.

అవును... రుమేనియాకు చెందిన లెజెండ్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన ఆ విమానం సుమారు 300 మంది ప్రయాణికులతో యూఏఈ నుంచి నికరాగువాకు బయలుదేరింది. ఈ సమయంలో అందులో ఉన్న ప్రయాణికులను కెనడా.. లేదా, అమెరికాకు అక్రమ ప్రవేశంలో భాగంగా చేరవేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయంట. దీంతో ఇంధనం నింపుకునేందుకు ఫ్రాన్స్‌ లోని వాట్రీ ఎయిర్‌ పోర్టులో దిగగా... వెంటనే అధికారులు ఈ విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు.

దీంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో అందులో ప్రయాణికులను ఫ్రాన్స్ అధికారులు విచారించారు. వారివద్ద ఉన్న గుర్తింపు పత్రాలను చెక్ చేశారు. ఇదే సమయంలో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 11 మంది మైనర్ల వెంట.. తెలిసిన పెద్దవారు ఎవరూ లేరని విచారణలో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇలా విచారణ చేపట్టిన అనంతరం ఎట్టకేలకు లైన్ క్లియర్ చేయడంతో ఆ విమానం మంగళవారం 276 మందితో సోమవారం అక్కడి నుంచి బయల్దేరింది. మంగళవారం ముంబైలో ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో ఎక్కువ మంది భారతీయుల ఉండటంతో... ఈ విమానాన్ని ఇండియాకు పంపినట్లు తెలుస్తుంది.

ఇక మిగిలిన వారిలో ఇద్దరు మైనర్లు సహా మొత్తం 25 మంది ఫ్రాన్స్‌ లోనే ఉంటామని చెప్పడంతో వారిని అక్కడే దించేసి.. మిగిలిన 276 మందిని తీసుకుని బయలుదేరిన లెజెండ్ విమానం ముంబైలో ల్యాండ్ అయింది. ఇలా విమానాన్ని వదిలిపెట్టడంపై ఫ్రాన్స్‌ లోని భారత రాయబార కార్యాలయం అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది.

Tags:    

Similar News