ప్రపంచంలోనే బ్యూటీల వ్యాలీ ఎక్కడుందో తెలిస్తే అవాక్కే
ఇలాంటి మేజిక్ మహిళలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందని చెబుతారు.ప్రపంచంలోనే అందగత్తెల వ్యాలీగా ఈ ప్రాంతాన్ని పిలుస్తుంటారు.
80 ఏళ్ల సంగతి తర్వాత యాభై దగ్గర్లోకి వచ్చేస్తున్నారంటేనే... అందం ఆవిరి కావడం సాధారణ విషయం. అలాంటిది 60 ఏళ్ల వయసులోనూ అందంగా కనిపించడం, 60 ఏళ్ల వయసులోనూ పిల్లల్ని కనే వరం ఉన్న మహిళలు ఈ భూమిపై ఒకే ఒక ప్రాంతంలో ఉంటారంటే నమ్ముతారా? కానీ నిజం. అలాంటి అద్భుతమైన ఆరోగ్యవంతమైన అందాల బొమ్మలు నివసించే ప్రాంతం ఒకటి ఉంది. అయితే.. ఈ ప్రాంతం ఎక్కడ ఉందంటే పాశ్చాత్య దేశాల్లో అన్న మాట వెంటనే వచ్చేస్తుంది.
కానీ.. అందరి అంచనాలకు భిన్నంగా మన దేశానికి పొరుగున ఉన్న దాయాది దేశంలోని ఒక ప్రాంతమే ఇలాంటి మేజిక్ మహిళలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందని చెబుతారు.ప్రపంచంలోనే అందగత్తెల వ్యాలీగా ఈ ప్రాంతాన్ని పిలుస్తుంటారు. ఇక్కడి వారు వందేళ్లు సరాసరి బతుకుతారని చెబుతుంటారు. అదెలా సాధ్యమంటే.. క్రమశిక్షణతో కూడిన వారి జీవన విదానం.. తీసుకునే ఆహారమే కారణమని చెబుతారు. ఇవే.. 80 ఏళ్ల వయసులో యవ్వనంలో ఉన్నట్లుగా కనిపించడం తో పాటు.. ఆరోగ్యంగా వందేళ్లు బతికేయడం ఇక్కడ రోటీన్ గా ఉంటుంది.
పాకిస్థాన్ లోని హుంజా వ్యాలీ.. ఇలాంటి అరుదైన అందగత్తెల వ్యాలీగా చెప్పాలి. ఇక్కడి స్త్రీలు ఎంతో అందగత్తెలుగా పేరొందారు. ఇక్కడి ప్రజలు చాలా అరుదుగా మాత్రమే జబ్బున పడతారని చెబుతారు. దీనికి కారణం ఇక్కడ ప్రవహించేనదిలోని వాటర్ విలువైన ఖనిజాలతో కూడి ఉండటంతో ఇలాంటి పరిస్థితి ఉందని చెబుతారు.
అంతేకాదు.. ఇక్కడి ప్రజలు మధ్యాహ్నం ఒకసారి.. రాత్రిపూట మరోసారి అంటే.. రెండుసార్లు ఆహారాన్ని తీసుకోవటం.. ఇక్కడి వారు ఇక్కడి వారినే పెళ్లాడటం.. ఇక్కడి ప్రజలు అత్యధికులు వ్యవసాయం చేస్తుంటారు. అంతేకాదు.. తాము పండించే పంటల్ని సహజసిద్ధంగా పెంచుతారే తప్పించి.. ఎలాంటి రసాయనాలు వాడేందుకు ఇష్టపడరు. తాము పండించిన పంటను తామే తినేస్తుంటారు. ఈ కారణంగానే వీరు ఆరోగ్యంగా.. అందంగా.. మిగిలిన వారికి భిన్నమైన రీతిలో ఉంటారని చెప్పొచ్చు.