ఘుమఘుమలాడే ఇరానీ చాయ్.. హైదరాబాద్ తో ఇరాన్ బంధం ప్రత్యేకం

బంజారాహిల్స్ లో కాన్సులేట్ భారత్ తోనే కాదు.. హైదరాబాద్ నగరంతో ఇరాన్ కు చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. హైదరాబాద్ లోని ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో ఇరాన్ కాన్సులేట్ ఉంది.

Update: 2024-05-20 13:30 GMT

హైదరరాబాద్ అంటే విశ్వ నగరం.. ఇక్కడ లభించే బిర్యానీకి ఎంతో పేరుంది. అంతేకాదు.. ఇరానీ చాయ్ కూడా హైదరాబాద్ లో మరింత స్పెషల్. సాసర్ లో పెట్టి ఓ పెద్ద కప్పులో ఇచ్చే ఈ చాయ్ నగరంలో ఎంతో పేరుగాంచింది. చాలామంది కబుర్లు చెప్పుకొంటూ కప్పులు కప్పులు ఇరానీ చాయ్ తాగుతుంటారు. తోడుగా ఉస్మానియా బిస్కట్లు, సమోసాలు లాగిస్తుంటారు. ఇరాన్ దేశం పేరుతో ఉన్న ఉన్న ‘ఇరానీ’ చాయ్ హైదరాబాదీలతో మమేకమైపోయింది.

పాక్ కు శత్రువు.. మనకు మిత్రుడు.. ఒకప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీగా ఉన్న ఇరాన్ ఆ తర్వాత ఇస్లామిక్ విప్లవంతో మతానికి ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే, పరిస్థితులు ఎంతగా మారినా ఇరాన్ తో భారత్ కు మొదటినుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు.. మన శత్రువు పాకిస్థాన్ .. ఇరాన్ కు కూడా శత్రువే. ఏడాది నుంచి ఈ రెండు దేశాల సంబంధాలు చాలా క్షీణించాయి. అంతెందుకు.. మన దేశం పాక్ ను తొక్కేందుకు భారీ చమురు పైప్ లైన్ నిర్మాణానికి ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

బంజారాహిల్స్ లో కాన్సులేట్ భారత్ తోనే కాదు.. హైదరాబాద్ నగరంతో ఇరాన్ కు చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. హైదరాబాద్ లోని ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో ఇరాన్ కాన్సులేట్ ఉంది. ఆ వీధికి ఇమామ్ ఖొమినీ రోడ్ అని పేరు పెట్టడం విశేషం. కాగా, ఈ కాన్సులేట్ లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం 45వ వార్షికోత్సవాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 10న నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండో-ఇరాన్ సంబంధాల ప్రాముఖ్యత గురించి తెలియజేసేలా.. కాన్సులేట్ వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. అంతేగాక హైదరాబాద్‌ లో ఇరానియన్ సాంస్కృతిక పక్షం సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు.

Tags:    

Similar News