వీడియో... భిక్షాటన పోస్టులపై స్పందించిన హైదరాబాద్ పోలీస్!

దీంతో.. కొంతమంది ఆ పోస్టులు నిజమనుకుని నమ్ముతుంటున్నారు. వాటిపై రియాక్ట్ అవుతుంటున్నారు.

Update: 2024-07-28 15:59 GMT

ఇటీవల సోషల్ మీడియా అంటే... ఏ మాత్రం కంట్రోల్ లేని సమాచార వ్యాప్తి ఫ్లాట్ ఫాం గా మారిన పరిస్థితి! ఆ సోషల్ మీడియా వేదికగా వెలిసే పోస్టుల్లో ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది తెలుసుకోవడం తలకు మించిన భారం అవుతుందని అంటున్నారు. దీనికి ఫ్యాక్ట్ చెక్ చేసి వాస్తవం ఏమిటనేది చెప్పే లోపు సదరు పోస్టులు ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తున్నాయి.

దీంతో.. కొంతమంది ఆ పోస్టులు నిజమనుకుని నమ్ముతుంటున్నారు. వాటిపై రియాక్ట్ అవుతుంటున్నారు. ఫలితంగా.. ప్రధానంగా పాలకుల విషయంలో ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లో బీఆరెస్స్ సోషల్ మీడియా అకౌంట్ గా చెబుతున్న హ్యాడిల్ నుంచి వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు స్పందించారు.

అవును... పలువురు నిరుద్యోగులు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని హైదరాబాద్ లోని అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి ప్రాంతాల్లో భిక్షాటన చేశారు! అయితే... వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో... దీనికి సంబంధించిన వీడియోను బీఆరెస్స్ పార్టీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది! "మరీ ఇంతదుర్మార్గమా?" అని రాసుకొచ్చింది.

ఇదే సమయంలో... "నిరుద్యోగులు భిక్షాటన చేయగా వారికి డబ్బులు ఇచ్చిందని ఓ మహిళను బలవంతంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు" అని పేర్కొంది. ఈ ట్వీట్ పై తాజాగా హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఇందులో భాగంగా.. వాస్తవాలు తెలుసుకుని పోస్టులు పెడితే బాగుండేదని అన్నారు.

నిజాలు తెలుసుకోకుండా మీరు పెట్టిన పోస్ట్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని.. ఆ వీడియో చూపించిన అమ్మాయితో పాటు మరికొందరు ధర్నా చేస్తుండగా వారు షాప్స్ లోకి వెళ్లి బిక్షాటన చేస్తున్నారని.. షాప్స్ వారు ఫిర్యాదు చెయగానే అక్కడికి పోలీసులు చేరుకుని లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా అక్కడ ఉన్నవారిని పంపించారని తెలిపారు.

ఈ సమయంలోనే వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి వారి నుండి తప్పించుకొని పక్కనే ఉన్న ఓ అకాడమీలోకి వెళ్లిందని.. తాను అక్కడ పనిచేసే అమ్మయిగా చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని.. మీరు చెప్పినట్లుగా పోలీసులు ఆ అమ్మయిని అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు.

Tags:    

Similar News