హైదరాబాద్ లో ఇంటి అద్దెలు.. టెనెంట్ లకు పట్టపగలే చుక్కలు

అవును... హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి

Update: 2024-01-28 10:30 GMT

ప్రస్తుతం పట్టణాల్లో ఇంటి అద్దెలు కోవిడ్ కు ముందు కోవిడ్ తర్వాత అన్నట్లుగా విభజించి చూస్తే... అప్పటికీ ఇప్పటికీ అస్సలు సంబంధమే లేదన్నట్లుగా పరిస్థితి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ లో కూడా ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా అద్దెలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయనే కామెంట్లను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా భారీగా పెరిగిన అద్దె ఇంటి ధరల ఇష్యూ వైరల్ గా మారింది.

అవును... హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా... రోజు రోజుకు యజమానులు అద్దెలు పెంచుకుంటూ పోతుండటంతో అద్దెలు కట్టేవారికి ఆర్థికభారం మరింతగా పెరుగుతోంది. ప్రధానంగా ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతాల్లో ఈ ధరలు మరింతగా పెరుగుతున్నాయని అంటున్నారు.

వాస్తవానికి కోవిడ్ కి ముందు హైదరాబాద్ లో ఇంటి అద్దెలు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. ఇక కోవిడ్ సమయంలో అంతా వర్క్ ఫ్రం హోం అయిపోయిన నేపథ్యంలో ఇంటి అద్దెలు దారుణంగా పడిపోయాయి! అసలు అద్దెకు దిగేవారే కరువైపోయారు!! అయితే ప్రస్తుతం చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం తొలగించి ఉద్యోగస్థులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి.

దీంతో... అద్దె ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. దీంతో ఇంటి యజమానులు భారీగా పెంచుకుపోతున్నారు. ఈ క్రమంలో 2019తో పోలిస్తే ఇంటి అద్దెలు ఎంత పెరిగాయనేదానిపై ప్రముఖ రియల్టీ సంస్థ హౌసింగ్.కాం ఓ కీలక నివేదిక విడుదల చేసింది. ఇందులో భాగంగా... ఇంటి అద్దెలు ఏ మేరకు పెరిగాయి.. ఆన్ లైన్ లో అద్దె ఇళ్ల కోసం సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య ఏ మేరకు పెరిగింది మొదలైన విషయాలు వెల్లడించింది.

ఈ క్రమంలో... దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు 25 - 30 శాతం మేర పెరిగాగని.. అదేవిధంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీల అద్దెలు 15 - 20 శాతం మేర అధిమయ్యాయని తెలిపింది. ఫలితంగ... రెంటల్ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు నివేదిక పేర్కొంది.

ఇదే సమయంలో... దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రాపర్టీల ధరలు 2019 ధరలతో పోలిస్తే ప్రస్తుతం 15 నుంచి 20 శాతం మేర పెరిగినట్లు వెల్లడించిన హౌసింగ్.కాం నివేదిక... అదేవిధంగా... ప్రాపర్టీలు, అద్దె ఇళ్ల కోసం ఆన్‌ లైన్‌ లో సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పేరిగినట్లు వెల్లడించింది. కొనుగోలు ఇండెక్స్‌ తో పోలిస్తే ఐ.ఆర్.ఐ.ఎస్. ఇండెక్స్ 23 పాయింట్లు అధికంగా ఉందని పేర్కొంది.

Tags:    

Similar News