టాప్ లో మన ఫిల్టర్ కాఫీ.. ప్రపంచ ర్యాకింగ్ లో మన స్థానం ఎంతంటే?

ఏదైనా కాఫీ షాప్ కు వెళ్లి.. కాఫీ గురించి అడిగితే.. వారు అడిగే కాఫీలకు నోరెళ్ల బెట్టాల్సిందే.

Update: 2024-10-16 05:30 GMT

కాఫీ ప్రియులు మాత్రమే కాదు ఎవరైనా సరే ఫిల్డర్ కాఫీ అన్నంతనే మనసు ఉత్సాహంతో ఉరకలేసేలా చేయటమే కాదు.. కాసింత కాఫీ తాగేద్దామా? అన్న ఫీలింగ్ ను తీసుకొస్తుంది. వేడివేడి.. ఘుమఘుమలాడే ఫిల్టర్ కాఫీ దెబ్బకు ఎంతటి వారైనా సరే అనాలసిందే. సరైన కాఫీ పడాలే కానీ.. ఆ అనుభూతి రోజు మొత్తాన్ని మార్చేస్తుందన్న మాట కాఫీ ప్రేమికుల నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది. కాఫీల్లో రకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఏదైనా కాఫీ షాప్ కు వెళ్లి.. కాఫీ గురించి అడిగితే.. వారు అడిగే కాఫీలకు నోరెళ్ల బెట్టాల్సిందే.

పలు రకాల కాఫీ ఆప్షన్లు ఉన్నప్పటికి ఫిల్టర్ కాఫీకి సాటి వచ్చేది మాత్రం లేదనే చెప్పాలి. ఇక.. సౌత్ లో ఫేమస్ అయిన ఫిల్టర్ కాఫీ తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమ కాఫీగా నిలవటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ ఫాం టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచ టాప్ కాఫీల జాబితాలో మన ఫిల్టర్ కాఫీకి రెండో స్థానం దక్కించుకోవటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.

తాజాగా విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలోనే టాప్ 10 కాఫీ రకాలు.. వాటిని అందించే దేశాల్ని చూస్తే..

1. క్యూబన్ ఎ్రస్పెస్సో - క్యూబా

2. ఫిల్టర్ కాఫీ - భారతదేశం

3. ఎ్రస్పెస్సో ఫ్రెడ్డో (గ్రీస్)

4. ఫ్రెడ్డో క్యాపుచినో (గ్రీస్)

5. క్యాపుచినో (ఇటలీ)

6. ఫ్రాప్పే కాఫీ (గ్రీస్)

7. రిస్ట్రోట్టో (ఇటలీ)

8. వియత్న మీస్ ఐస్డ్ కాఫీ (వియత్నాం)

9. ఎస్పెస్సో (ఇటలీ)

10. టర్కీష్ కాఫీ (టర్కీ)

ఇంతకూ మన దేశంలోకి కాఫీ ఎలా వచ్చిందన్న దానికి ఆసక్తికర కథనాన్ని చెప్పుకొస్తారు. ఒకరు రహస్యంగా మన దేశంలోకి తీసుకొచ్చిన ఏడు కాఫీ గింజలు ఇంత పెద్ద స్థాయిలో కాఫీ ప్రియుల్ని తయారు చేసినట్లుగా చెబుతారు. మన దగ్గర కాఫీకి మూలం ఆఫ్రికా నుంచి యెమెన్ కు తీసుకొచ్చి పెంచిన కాఫీ గింజల్ని వేరే దేశాలకు అమ్మటం.. ఇవ్వటం బ్యాన్. అయితే.. మక్కాకు వెళ్లిన సూఫీ సెయింట్ బాబా అక్కడి నుంచి రహస్యంగా ఏడు గింజల్ని భారత్ కు తీసుకొచ్చి కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మగలూర్ కొండల్లో నాటినట్లుగా చెబుతారు. అలా మన దేశంలోకి కాఫీ ఎంట్రీ ఇచ్చినట్లుగా చెబుతారు. అదే సమయంలో టీకి ప్రత్యామ్నాయంగా బ్రిటీష్ వాళ్లు కాఫీ అమ్మకాల్ని ప్రోత్సహించినట్లుగా చెబుతారు. అలా కర్ణాటకలో మొదలై.. కేరళ.. తమిళనాడు.. రెండు తెలుగు రాష్ట్రాలకు కాఫీ విస్తరించినట్లుగా చెబుతారు.

ఫిల్టర్ కాఫీ తాగటంతో గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుందని చెబుతారు. మూడ్ బూస్టర్ గా.. ఏకాగ్రత.. చురుకుదనం.. మానసిక స్పష్టతను మెరుగుపర్చేందుకు కాఫీ సాయం చేస్తుందని చెబుతారు. అతిగా కాకుండా మితంగా కాఫీ తాగితే మేలు. కాఫీలోని కెఫిన్ తో రక్తపోటు..హార్ట్ రేట్.. యాంగ్జైటీని పెంచుతుందని చెబుతారు. ఈ కారణంగానే చిన్నపిల్లలు.. గర్భిణులు కాఫీకి దూరంగా ఉండాలన్న మాట చెప్పటం తెలిసిందే.

Tags:    

Similar News