ఓసీఐ నియమాలపై పుకార్లపై క్లారిటీ వచ్చేసింది!

అవును... ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా నియమాలలో ప్రతిపాదిత మార్పులకు సంబంధించి ఇటీవల భారతీయ అమెరికన్ కమ్యునిటీలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-29 03:34 GMT

ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు హోల్డర్లపై ఆంక్షలు విధించినట్లు వచ్చిన వార్తలను న్యూయార్క్ లోని ఇండియా ఎన్ కాన్సులేట్ తోసిపుచ్చింది. ఓసీఐ కార్డు హోల్డర్ల హక్కులకు సంబంధించి మార్చి 4, 2021 నాటి గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధనల్లో మార్పు లేదని.. అవే అమలులో కొనసాగుతున్నాయని స్పష్టత ఇచ్చింది.

అవును... ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా నియమాలలో ప్రతిపాదిత మార్పులకు సంబంధించి ఇటీవల భారతీయ అమెరికన్ కమ్యునిటీలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ గందరగోళంపై క్లారిటీ వచ్చింది. ఫలితంగా వారందరికీ పెద్ద ఉపశమనం కలిగిందనే చెప్పాలి.

ఓసీఐ కార్డ్ హోల్డర్ల కోసం ఇటీవల కాలంలో ఎలాంటి కొత్త మార్పును ప్రవేశపెట్టలేదని ఇండియన్ అమెరికన్ సమాజంలోని స్నేహితులకు తెలియజేయడమైందని న్యూయార్క్ లోని ఇండియా ఎన్ కాన్సులేట్ తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్ నిబంధనలను మార్చి 4, 2021 నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధనల్లో మార్పు లేదు అని ఎక్స్ లో పోస్ట్ పెట్టింది.

కాగా... గత కొన్ని రోజులుగా చాలా మంది ఓసీఐ కార్డు హోల్డర్లు విదేశీయులుగా తిరిగి వర్గీకరించడంపై ఫిర్యాదు చేశారు. జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలను సందర్శించడానికి అనుమతి తీసుకోవాల్సిన నిబంధనలలో మార్పుల గురించి కార్డ్ హోల్డర్లు ఫిర్యాదు చేశారు.

అయితే... భారత ప్రభుత్వం మార్చి 2021లో నోటిఫై చేసిన నిబంధనలను మాత్రమే అమలు చేస్తోందని.. ఇందులో ఎలాంటి కొత్త మార్పులూ చేయలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Tags:    

Similar News