యూకేలో ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు పదేళ్ల జైలు
వివరాళ్లోకి వెళ్తే... గత ఏడాది జనవరి 16వ తేదీ తెల్లవారుజామున లీసెస్టర్ సిటీ సెంటర్ లో రాత్రిపూట విహారయాత్రకు వెళ్లిన బాధితురాలిని ముగ్గురు వ్యక్తులు సంప్రదించారు.
విదేశాల్లోని మగ్గించేసే వారి వల్ల, మరికొంతమంది వల్ల మన భారతీయులకు ఇబ్బందులు వస్తున్నాయని చాలా వార్తలే వెలుగులోకి వచ్చాయి. అయితే... ఇది అందుకు రివర్స్! మన భారతీయుల వల్ల బ్రిటన్ లో ఒక మహిళ ఇబ్బంది పడింది. ఊహించని సమస్యను అనుభవించింది. ఫలితంగా ముగ్గురు భారతీయులకు పెద్ద శిక్షే పడింది!
అవును... గత ఏడాది బ్రిటన్ లోని లీసెస్టర్ నగరంలో ఓ మహిళను బలవంతంగా తమ కారులో ఎక్కించుకున్న భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై హత్యాచారానికి పాల్పడ్డారని అంటున్నారు. ఈ కేసులో అజయ్ దొప్పలపూడి (27), వహర్ మంచాల (24), రాణా యెల్లంబాయి (30)లను ఈ కేసులో దోషులుగా తేల్చిన న్యాయస్థానం ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది!
వివరాళ్లోకి వెళ్తే... గత ఏడాది జనవరి 16వ తేదీ తెల్లవారుజామున లీసెస్టర్ సిటీ సెంటర్ లో రాత్రిపూట విహారయాత్రకు వెళ్లిన బాధితురాలిని ముగ్గురు వ్యక్తులు సంప్రదించారు. దీంతో బాధితురాలు అది టాక్సీ అని నమ్మి వారి కారు ఎక్కింది. అయితే కానీ అది తన ఇంటి నుండి దూరంగా నార్బరో రోడ్ వెంబడి వెళ్తుండటం ఆమె గమనించిందంట.
దీంతో ఆమె భయపడినట్లుగానే నిందితులు ఆమెను దాదాపు 15 మైళ్ల దూరం తీసుకెళ్లి.. లుటర్ వర్త్ కు సమీపంలోని ఎం1 నుంచి మిస్టర్టన్ లోని ఏకాంత ప్రాంతంలో కారును ఆపారట. అనంతరం బాధితురాలిని బలవంతంగా కారులోంచి కిందకు లాగారు. అప్పటికే మహిళ మద్యం మత్తులో వుందని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలియజేసింది.
ఈ పరిస్థితుల్లో కాసేపటికి బాధితురాలు వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించింది. దీంతో నిమిషాల వ్యవధిలోనే అధికారులు అక్కడికి చేరుకుని.. ఆమెను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్ ద్వారా లీసెస్టర్ సిటీ సెంటర్ గౌల్ స్ట్రీట్ లో నిందితులు నివసిస్తున్నట్లు కనుగొని అరెస్ట్ చేశారని తెలుస్తుంది.
ఇదే సమయలో... నిస్సందేహంగా ఈ ముగ్గురు వ్యక్తులు రాక్షసులు.. వారు ఆదివారం తెల్లవారుజామున సిటీ సెంటర్ లో తమ లైంగిక వాంచను నెరవేర్చుకోవడానికి ఒక మహిళ కోసం వెతుకుతున్నారు అని డిటెక్టివ్ కానిస్టేబుల్ గెమ్మ ఫాక్స్ నివేదించారు. ఈ నేపథ్యలో కోర్టు ఈ ముగ్గురుకీ ఒక్కొక్కరికీ పదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.