ప్రాంతీయ యుద్ధం.. మూడో ప్రపంచ యుద్ధం.. వీటిలో ఏది?

ఇజ్రాయెల్ ఒక్కచేత్తోనే హమాస్, హెజ్బొల్లా, ఇరాన్, సిరియా, లెబనాన్ లతో యుద్ధం చేస్తోంది.

Update: 2024-10-02 03:47 GMT

అసలే పశ్చిమాసియా.. ఆపై హమాస్, హెజ్బొల్లా, హూతీ వంటి భయంకర ఉగ్రవాద సంస్థలు.. ఒక్క ఇజ్రాయెల్.. చుట్టూ అరబ్ దేశాలు.. ఒకటీ, రెండింటితో మినహా దేనితోనూ ఇజ్రాయెల్ కు సత్సంబంధాలు లేవు.. ఇలాంటి సమయంలో గత ఏడాది అక్టోబరు 7న హమాస్.. ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి భారీ దాడులకు దిగింది. వందల మందిని హతమార్చింది. దీంతోనే ఇజ్రాయెల్ కసిదీరా యుద్ధం చేస్తోంది. హమాస్ అడ్డా గాజా స్ట్రిప్ లో విధ్వంసం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చింది. అంతకుముందు హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను ఇరాన్ లో హతమార్చింది ఇజ్రాయెల్. హెజ్బొల్లా ఇరాన్ పెంపుడు కొడుకు. ఇక హనియా ఇరాన్ లో అతిథిగా ఉండగా హత్యకు గురయ్యారు. అంతకుముందు ఏప్రిల్ లో లిబియాలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్జీసీ)ను చంపేసింది ఇజ్రాయెల్.

రాకెట్ల వర్షంలో..

ఇరాన్ మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ పైకి 400 రాకెట్లు ప్రయోగించింది. వీటి ద్వారా ఎంత నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉన్నా.. దీనిపై ఇజ్రాయెల్ స్పందన తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు. బహుశా దీన్ని ఊహించిందేమో.. అమెరికా మంగళవారం ముందుగానే ఇరాన్ ను హెచ్చరిచించింది. ఇజ్రాయెల్ పై దాడి చేస్తే కఠిన పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. అయినా అమెరికా బద్ద శత్రువు ఇరాన్ ఆగలేదు. ఇరాన్-సిరియా-లెబనాన్ లతో ఇజ్రాయెల్ తలపడుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ భూభాగంలోకి వెళ్లాయి. ఇరాక్, ఇరాన్, సిరియా కలిసి ఇరాన్ పై దాడి చేస్తాయనే కథనాలూ వచ్చాయి.

ప్రాంతీయ యుద్ధమే?

ఇజ్రాయెల్ ఒక్కచేత్తోనే హమాస్, హెజ్బొల్లా, ఇరాన్, సిరియా, లెబనాన్ లతో యుద్ధం చేస్తోంది. అమెరికా మద్దతు పలుకుతున్నా నేరుగా రంగంలోకి దిగడం లేదు. దీంతో ఇది ప్రాంతీయ యుద్ధంగానే ఉంది. ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ జరిపిన దాడుల్లో తీవ్రంగానే దెబ్బతిన్నది. ఆ దేశ రాజధాని టెల్ అవీవ్ పైనా ఉగ్ర దాడి జరిగింది. ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ ఉద్రిక్తతలు ఎన్ని రోజులు కొనసాగుతాయో చూడాలి.

మూడో ప్రపంచ యుద్ధం దిశగా?

ఇరాన్ కు రష్యా బలమైన మద్దతుదారు. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు ఇరాన్ డ్రోన్లు సరఫరా చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలను తాజా పరిణామాలు మరింత బలోపేతం చేశాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఇరాన్ అత్యంత సంక్లిష్ట యుద్ధానికి దిగింది. దీంతో రష్యా కచ్చితంగా ఆ దేశానికి సాయంగా వస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. మరి రష్యా రంగంలోకి దిగితే.. చైనా కూడా దానితో జత కలవడం ఖాయం. ఉత్తర కొరియా ఎలా స్పందిస్తున్నది చూడాలి. ఇదే జరిగితే అటు ఇజ్రాయెల్ కు తోడు గా అమెరికా, బ్రిటన్, జర్మనీ ఫ్రాన్స్ తదితర దేశాలతో కూడిన నాటో కూటమి, ఇటు రష్యా-ఇరాన్-చైనా తలపడినట్లు అవుతుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

ధరల చమురు తప్పదా?

ఉక్రెయిన్ పై రెండున్నరేళ్లు రష్యా సాగిస్తున్న యుద్ధం కొనసాగుతోంది. చమురు, ఆహార ధరలపై ప్రభావం పడింది. ఈ క్రమంలోనే ఇరాన్-హమాస్ ఘర్షణ మొదలై ఏడాదిగా నడుస్తోంది. ఇప్పుడు తాజా ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఇక సమరమే. అసలే చమురు నిల్వలు అధికంగా ఉన్న ఇరాన్, రష్యా పూర్తిగా యుద్ధంలోకి తలమునకలైతే పరిస్థితి ఊహించలేం. ఇప్పటికే మధ్యధరా సముద్రంలో చమురు పైప్ లైన్ దెబ్బతిన్నదన్న ప్రచారం జరుగుతోంది. మరి మున్ముందు ఏం జరుగుతోందో?

Tags:    

Similar News