ట్రంప్ ఎఫెక్ట్... ఇరాన్ కు ఫస్ట్ బిగ్ షాక్ తగిలేసింది!

ఈ నేపథ్యంలో కరెన్సీ విషయంలో ఇరాన్ కు ఫస్ట్ దెబ్బ తగిలేసింది.

Update: 2024-11-07 04:00 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విక్టరీ సాధించడంతో... డెమోక్రాట్లకంటే ఎక్కువగా ఇరాన్ ప్రభుత్వం ఎక్కువ బాధపడుతుందని చెప్పినా అతిశయోక్తి కాదనే అనుకోవాలి. ట్రంప్ ప్రెసిడెంట్ అయితే.. ఇజ్రాయెల్ కు కొత్త బలం వస్తుందనే విషయం ఇరాన్ కు తెలుసని అంటుంటారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో కరెన్సీ విషయంలో ఇరాన్ కు ఫస్ట్ దెబ్బ తగిలేసింది.

అవును... డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో ఇరాన్ కరెన్సీ విలువ భారీగా క్షీణించింది. అది ఏ స్థాయిలో అంటే... ఒక డాలర్ కు 7.03 లక్షల రియాల్స్ స్థాయికి భారీ పతనాన్ని చూసింది. దీంతో... ట్రంప్ హయాంలో ఇరాన్ పరిస్థితి ఎలా ఉండబోతుందనే విషయం స్పష్టమవుతుందని.. ఇరాన్ పై ఆంక్షలు మరింత పెంచుతారని అంటున్నారు పరిశీలకులు.

వాస్తవానికి 2015లో అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకునే సమయంలో ఒక డాలర్ కు 32 వేల రియాల్స్ ఉండేవి. అయితే... ఇరాన్ లో సంస్కరణవాద అధ్యక్షుడు మసూద్ పెజెషికియాన్ బాధ్యతలు స్వీకరించేనాటికి పరిస్థితి దరుణంగా పడిపోయింది. ఇందులో భాగంగా... ఒక డాలర్ కు 5.84 లక్షల రియాల్స్ గా మారక విలువ చేరింది.

ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికార ప్రతినిధి స్పందిస్తూ... అమెరికా అధ్యక్ష ఎన్నికలతో తమకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదని.. అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ విధానాలు స్థిరంగానే ఉంటాయని.. తాము ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నామని.. అమెరికా అధ్యక్షులు మారినంత మాత్రాన్న పెద్దగా ఏమీ మారవని అన్నారు.

సంబరాల్లో ఇజ్రాయెల్:

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమెన్ నెతన్యాహు, అతని మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ ను అభినందిస్తూ.. "చరిత్రలో గొప్ప పునరాగమనం" అని వ్యాఖ్యానించారు నెతన్యాహు. ఇదే సమయంలో... వైట్ హౌస్ కి ట్రంప్ చరిత్రాత్మక పునరాగమనం.. అమెరికాకు కొత్త ప్రారంభాన్ని ఇస్తుందని అన్నారు.

Tags:    

Similar News