ఓటర్ల వారీగా పోల్ మేనేజ్మెంట్ జరుగుతోందా ?
ఇక సీ అంటే మూడోవర్గం ఓటర్లు ఎవరంటే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లన్నమాట. వివిధ కారణాలతో వీళ్ళు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లేసే వాళ్ళుండచ్చు లేదా ఇతర పార్టీల మద్దతుదారులు కూడా అయ్యుండచ్చు.
అధికార బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ కు దిగినట్లు సమాచారం. ఎన్నిక ఏదైనా సరే పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసుకోలేకపోతే ఎంతటి నేతైనా గెలిచేది అనుమానమే. ఈ విషయంలో కేసీయార్ కు బాగా అనుభవం ఉన్నది. అందుకనే ఇప్పటినుండే పోల్ మేనేజ్మెంట్ మొదలుపెట్టేశారని పార్టీ వర్గాల సమాచారం. అది ఎలా జరుగుతోందంటే ఓటర్లను ఏ బీ సీ మూడు వర్గాలుగా విడదీశారట. వర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను లెక్కలు వేస్తున్నారు.
ఏ కేటగిరిలో ఓటర్లంటే పార్టీకి సంబంధించిన ఓటర్లు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పార్టీ నేతల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, బాగా దగ్గరి వాళ్ళు. అలాగే పార్టీ సానుభూతిపరులు, పార్టీ మద్దతుదారులు కూడా ఏ కేటగిరి లోకి వస్తారు. ఇక బీ కేటగిరి అంటే తటస్ధ ఓటర్లన్నమాట. వీళ్ళు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు. పైగా రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేనివాళ్ళు. వీళ్ళ మొగ్గే చాలా కీలకమని కేసీయార్ ఇప్పటికే అభ్యర్థులు, ముఖ్య నేతలు, పార్టీకి పనిచేసే వాళ్ళకి స్పష్టంగా చెప్పారు. వీళ్ళు ఎటువైపు మొగ్గితే ఆ పార్టీదే గెలుపని కేసీయార్ స్పష్టంగా చెప్పారట.
ఇక సీ అంటే మూడోవర్గం ఓటర్లు ఎవరంటే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లన్నమాట. వివిధ కారణాలతో వీళ్ళు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లేసే వాళ్ళుండచ్చు లేదా ఇతర పార్టీల మద్దతుదారులు కూడా అయ్యుండచ్చు. కేసీయార్ చివరి రెండు కేటగిరిలు అంటే బీ సీ వర్గాల ఓటర్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పారట. బీ సీ కేటగిరీలకు సంబంధించిన ఓటర్లపై ఎక్కువగా దృష్టిపెట్టి రెండుమూడుసార్లు కలిసి ఓట్లు వేయమని విజ్ఞప్తులు చేయాలని చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఈ వర్గాలను రెండుమూడు విడతలుగా కలవటం ద్వారా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని వివరించి చెప్పాలన్నారు. ప్రభుత్వం నుండి అందిన లబ్ది వివరాలను కూడా చర్చించాలని చెప్పారట. రెండు మూడుసార్లు కలవటం వల్ల తటస్ధ ఓటర్లు, ప్రత్యర్ధి పార్టీలకు చెందిన ఓటర్లను కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చుకునే అవకావాలున్నాయన్నది కేసీయార్ ఆలోచన. మరి అభ్యర్ధులు, నేతలు ఏమి చేస్తారో చూడాల్సిందే.