షాకింగ్... ఇరాన్ సీక్రెట్ సర్వీస్ అధిపతే ఇజ్రాయెల్ గూఢచారి..!

హెజ్ బొల్లా ఉగ్రవాదులు లక్ష్యంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-01 10:25 GMT

హెజ్ బొల్లా ఉగ్రవాదులు లక్ష్యంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ అట్టుడికిపోతోంది. ఐడీఎఫ్ రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఈ సమయంలో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహముద్ అహ్మదిన్ జాద్... ఓ షాకింగ్ విషయం వెల్లడించారు.

అవును... ఇప్పుడు ప్రపంచమంతా ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న వ్యూహాత్మక దాడుల గురించి మాట్లాడుకుంటున్న వేళ.. ఇరాన్ లో నిరంకుశ పాలనను అంతం చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేసిన సమయంలో... ఇరాన్ మాజీ ఆధ్యక్షుడు మహముద్ అహ్మదిన్ జాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఇరాన్ సీక్రెట్ సర్వీస్ అధిపతి ఇజ్రాయెల్ గూఢచారిగా మారిపోయాడని అన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఇజ్రాయెల్ పై నిఘా కొసం ఏర్పాటు చేసిన ఓ ఇంటెలిజెన్స్ అధిపతే.. చివరికి తమను మోసం చేసి, తమ సమాచారన్ని ఇజ్రాయెల్ కు చేరవేసేవాడని ఆరోపించారు.

సీ.ఎన్.ఎన్. తుర్క్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... టెహ్రాన్ లో మొస్సాద్ సంస్థ ఏ స్థాయిలో వెళ్లూనుకుందో వెల్లడిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... ఇరాన్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ను ఇజ్రాయెల్ జాతీయ గూఢచార సంస్థ మొస్సాద్ సక్సెస్ ఫుల్ గా తనవైపు తిక్కుకొందని అన్నారు.

ఈ క్రమంలోనే సుమారు 20 మంది ఇంటెలిజెన్స్ సిబ్బంది డబుల్ ఏజెంట్లుగా మారిపోయారని.. ఫలితంగా ఇజ్రాయెల్ కు అత్యంత కీలకమైన అణు రహస్యాలను సైతం చేరవేశారని అన్నారు. తమ నిఘా సంస్థకు చెందిన ఓ అధిపతే ఇజ్రాయెల్ గూఢచారి అని 2021లో బయటపడిందని అన్నారు. దీంతో... ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

ఇరాన్ లో మొస్సాద్ ఓ ఆపరేషన్ చేసి సుమారు లక్ష అణుపత్రాలను అపహరించిందని.. ఇజ్రాయెల్ ప్రధాని 2018లో ఈ విషయాన్ని బహిర్గతం చేశారని.. టెహ్రాన్ లోని రహస్య స్థావరాల్లోకి చొరబడిన మొస్సాద్ ఏజెంట్లు వీటిని దక్కించుకొన్నారని.. వాటిలో ఇరాన్ ఏ విధంగా అణు కార్యక్రమాలు నిర్వహిస్తోందో ఉందని తెలిపారు. దీంతో... ఇరాన్ భద్రత, నిఘా వ్యవస్థలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News