అంతరిక్షంలో ఇస్రోకు ‘హ్యాపీ న్యూ ఇయర్’..
తాజాగా ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ విజయవంతమైంది. బుల్లెట్ వేగంతో రెండు ఉపగ్రహాలను కనెక్ట్ చేసిన ఈ ప్రయోగంతో చరిత్ర సృష్టించినట్లైంది.
2024 సంవత్సరం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు బాగా గుర్తుండిపోతుంది.. మైలురాయిలాంటి ప్రయోగాలు ఎన్నో ఈ ఏడాది చేసింది. నింగిలోకి 99వ ప్రయోగాలకు చేరింది. చరిత్రాత్మక సెంచరీకి మరొక్క అడుగు దూరంలో నిలిచింది. కాగా, తాజాగా ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ విజయవంతమైంది. బుల్లెట్ వేగంతో రెండు ఉపగ్రహాలను కనెక్ట్ చేసిన ఈ ప్రయోగంతో చరిత్ర సృష్టించినట్లైంది. ఇది అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే సాధ్యమైంది.
విజయాశ్వం పీఎస్ఎల్వీతో..
మొత్తం 62 ప్రయోగాలు.. అందులో 59 విజయవంతం.. పీఎస్ఎల్వీ సిరీస్ ప్రస్థానం ఇది. అందుకే ఇస్రో విజయాశ్వంగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ)ను అభివర్ణిస్తారు. దానితో తాజా ప్రయోగం 62వది.
సొంత టెక్నాలజీ, స్వదేశీ యువ సైంటిస్టులతో తెలుగు నేలపై రూపకల్పన చేసిన స్పేస్ డెక్స్ సోమవారం నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో రెండు రాకెట్లను డాకింగ్, అన్ డాకింగ్ చేయడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి.
పీఎస్‌ఎల్‌వీ-సీ60 రాకెట్ నుంచి రెండు చిన్న అంతరిక్ష నౌకలను ప్రయోగించారు. గంటకు 200 కి.మీ. వేగంతో ఎగురుతూ, అంతరిక్షంలో నిర్ధిష్ట ప్రదేశంలో 2 స్పేస్ క్రాప్ట్ లను కలపడం-స్పేస్ డాకింగ్ ప్రయోగాలకు ఉద్దేశించిన పీఎస్ఎల్వీ-సి60ని ఇస్రో ప్రయోగించింది.
పీఎస్ఎల్వీ కోర్ అలోన్ దశతో 18వ ప్రయోగం కావడం విశేషం. ఈ మిషన్ విజయవంతంతో అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ చేరింది.
డాకింగ్ కు పేటెంట్
డాకింగ్ పై ఇస్రో పేటెంట్ తీసుకోవడం విశేషం. డాకింగ్, అన్ డాకింగ్ వంటివి క్లిష్టమైన వివరాలు. పైగా ఇస్రో సొంత డాకింగ్ యంత్రాంగాన్ని సృష్టించుకుంది.
అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ సాకారం..
అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మాణం భారత్ లక్ష్యం. దీంతోపాటు చంద్రయాన్-4 విజయం డాకింగ్ మిషన్ పై ఆధారపడి ఉంటుంది. డాకింగ్ మిషయన్ లోని రెండు నౌకల్లో ఒకదాని పేరు టార్గెట్, మరొకదాని పేరు చేజర్. రెండింటి బరువు 220 కిలోలు. PSLV-C60 రాకెట్ నుంచి 470 కి.మీ ఎత్తులో రెండు వ్యోమ నౌకలను వేర్వేరు దిశల్లో ప్రయోగించారు. ఈ సమయంలో టార్గెట్, చేజర్ వేగం గంటకు 28,800 కిలోమీటర్లు. డాకింగ్ ప్రక్రియ ప్రయోగించిన 10 రోజుల తర్వాత ప్రారంభమవుతుంది.