విధుల‌కు ఆటంకం... జ‌గ‌న్‌పై కేసు?

అయితే.. జ‌గ‌న్ పోలీసుల ఆదేశాల‌ను విస్మ‌రించారు. కాన్వాయ్‌ను అక్క‌డే వ‌దిలేసి.. రోడ్డు మార్గం మీదుగా న‌డుచుకుంటూ ముందుకు సాగారు.

Update: 2025-01-10 04:00 GMT

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై కేసు న‌మోదు చేసేందుకు తిరుప‌తి జిల్లా పోలీసులు ఉన్న‌తాధికారు ల‌ను కోరిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మ విధుల‌కు ఆటంకం క‌లిగించ‌డంతోపాటు ట్రాఫిక్ స‌మ‌స్య‌ను తీసుకువ‌చ్చార‌ని.. వారు చెబుతున్నారు. గురువారం సాయంత్రం తిరుప‌తి తొక్కిస‌లాట బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్‌ను ఓ అర‌గంట ఆగాల‌ని కోరుతూ.. తిరుచానూరు క్రాస్ వ‌ద్ద పోలీసులు విన్న‌వించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కాన్వాయ్‌ను కూడా నిలువ‌రించారు.

అయితే.. జ‌గ‌న్ పోలీసుల ఆదేశాల‌ను విస్మ‌రించారు. కాన్వాయ్‌ను అక్క‌డే వ‌దిలేసి.. రోడ్డు మార్గం మీదుగా న‌డుచుకుంటూ ముందుకు సాగారు. `జెడ్ ` కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో ఉన్న జ‌గ‌న్ ఇలా ఒక్క‌సారి రోడ్డెక్కి న‌డ‌వ డంతో పోలీసులు బిత్త‌ర పోయారు. త‌మ‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండానే రోడ్డు మార్గంలో న‌డుచుకుంటూ వెళ్ల‌డంతో వారు కూడా ఆయ‌న వెంట ప‌రుగులు పెట్టారు. దీంతో అత్యంత ర‌ద్దీగా ఉండే తిరుచానూరు క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ ఆగిపోయింది.

మ‌రోవైపు త‌మ ఆదేశాల‌ను కూడా ప‌ట్టించుకోక‌వ‌డంతో పోలీసులు ప‌రుగులు పెట్టి ఆయ‌న బ్ర‌తిమాలుకు న్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం ఏర్ప‌డుతుంద‌ని.. అలా చేయొద్ద‌ని కోరారు. ఇంత‌లోమాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వాహ‌నంతో రావ‌డంతో ఆ వాహ‌నంలో జ‌గ‌న్ స్విమ్స్‌కు వెళ్లారు. అయితే.. అక్క‌డ అప్ప‌టికే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నారు. దీంతో అక్క‌డ కూడా ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ మొత్తం ప‌రిణామాల‌పై ఉన్న‌తాధికారులు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని పోలీసులు తెలిపారు.

ఈ క్ర‌మంలో జిల్లా అధికారుల ఆదేశాల మేర‌కు జ‌గ‌న్‌పై కేసు న‌మోదు చేసేందుకు ఉన్న‌తాధికారుల‌కు విన్న‌వించిన‌ట్టు చెబుతున్నారు. మాజీ సీఎం కావ‌డంతో ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల మేర‌కు కేసు న‌మోదు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ట్రాఫిక్‌ను అడ్డుకోవ‌డం.. అధికారుల విధుల‌కు ఆటంకం క‌లిగించ‌డంతోపాటు.. త‌మ ఆదేశాలు పాటించ‌క‌పోవ‌డంపై ప‌లు సెక్ష‌న్ల కింద జ‌గ‌న్‌పై కేసు న‌మోదు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News