చంద్రబాబు మాటలు విన్నారా? జగన్ షాకింగ్ రియాక్షన్
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక్క రోజు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక్క రోజు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. రాగద్వేషాలకు, పక్షపాతం లేకుండా పాలిస్తానని రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేసిన చంద్రబాబు వైసీపీ కార్యకర్తలకు పథకాలు ఆపేస్తానని ప్రకటించడం ఏంటంటూ మాజీ సీఎం జగన్ నిలదీశారు. చంద్రబాబు పాలన రాష్ట్రానికి శ్రేషస్కరం కాదన్న జగన్.. సీఎంపై ఓ రేంజులో ఫైర్ అయ్యారు.
తనకు హోదా ఇచ్చేవరకు అసెంబ్లీకి రానంటూ చెప్పిన జగన్.. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీడియాతో మాట్లాడతానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా, జగన్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలకు పనులు చేయొద్దనడమే కాకుండా పథకాలు ఆపేస్తామని చిత్తూరు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడాన్ని ఆయన ఖండించారు. పథకాలు ఆపేయడానికి చంద్రబాబు సొమ్ము ఏమైనా ఇస్తున్నారా? అంటూ నిలదీశారు.
బహిరంగ సభలో అందరి సమక్షంలో ఏ పథకాలు ఇవ్వొద్దని చెప్పడమేంటని నిలదీశారు. ప్రజల కోసం ప్రజల సొమ్ముతో ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయాన్ని మరచిపోవద్దని హితవు పలికారు. బాహటంగా విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై న్యాయమూర్తలు, గవర్నర్ చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబును ఒక్క నిమిషమైనా? ముఖ్యమంత్రిగా కొనసాగించడం ధర్మం కాదన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ఎలాంటి సంకేతాలు ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా కొనసాగడం ఏ రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని జగన్ వ్యాఖ్యానించారు.