జగన్ మాట యాంటీ అనుకుంటే పాజిటివ్ అయిందే..!
అయితే.. జగన్ను వ్యతిరేకించేవారు అనుకుంటున్నట్టుగా కాకుండా.. పాజిటివ్‌గా దీనిపై మహిళలు రియాక్ట్ కావడం గమనార్హం.
ఏపీ సీఎం జగన్ తాజాగా చేసిన ఓ వ్యాఖ్యపై రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. ''ఇప్పటి కిప్పు డు సంతోషంగా దిగిపోతా!'' అన్న ఒక్క కామెంట్.. చుట్టూ రాష్ట్ర రాజకీయాలు జోరుగా సాగాయి. తిరుపతిలో జరిగిన ఇండియాటుడే ఎడ్యుకేషన్ కాంక్లేవ్‌లో పాల్గొన్న సీఎం జగన్.. ఓ ప్రశ్నకు సమాధానంగా.. ఈ వ్యాఖ్య చేశారు. ప్రజలకు తాను ఎన్నో మేళ్లు చేశానని.. ప్రతి మహిళకు, ప్రతి కుటుంబానికీ ఆర్థికంగా దన్నుగా మారానని.. ఈ క్షణం తనకు చాలని ఇప్పటికిప్పుడు సంతోషంగా దిగిపోయేందుకు రెడీయేనని అన్నారు.
సీఎం జగన్ చేసిన ఈ కామెంట్‌లో ఆయన ఉద్దేశం ఎలా ఉన్నా.. ప్రతిపక్షాలు సహా ఓ మీడియా వర్గం.. దీనిని విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రధాన మీడియాలో అయితే.. రోజు రోజంతా దీనిపై చర్చలు కూడా పెట్టాయి. దీంతో జగన్ ఇంగ్లీష్‌లో చేసిన ఈ కామెంటు.. తెలుగులో అనువాదం చేసి మరీ వినిపించడంతో ప్రజలలోకి జోరుగా వెళ్లింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు.. సంక్షేమం అందుకుంటున్న వర్గాల్లోనూ .. ఇది చర్చకు దారితీసింది.
అయితే.. జగన్ను వ్యతిరేకించేవారు అనుకుంటున్నట్టుగా కాకుండా.. పాజిటివ్‌గా దీనిపై మహిళలు రియాక్ట్ కావడం గమనార్హం. ''జగన్ దిగిపోతాడా?'' అనే మాట సామాన్య ప్రజానీకంలో ఆసక్తికర చర్చగా మారింది. మహిళల ఫోన్లలోనూ ఇదే విషయంపై కామెంట్లు వచ్చాయి. ఆయన దిగిపోతే.. మన పథకాలు ఎలా? అని పేదలు, లబ్ది పొందుతున్న వారు చర్చించుకోవడం గమనార్హం. దీంతో జగన్ వ్యాఖ్యలను విపరీతంగా ప్రచారం చేసిన మీడియా.. వెంటనే దీనిని నిలిపివేయడం గమనార్హం.
అంతేకాదు. అసలు ఈ ఊసు కూడా రాకుండా.. షర్మిల కామెంట్లను తెరమీదికి తెచ్చారు. కుటుంబ వివాదాలపై ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రచారం చేశారు. అయితే.. వీటిపైనా.. ప్రజల నుంచి అనూహ్య మైన ఎదురు దాడి కనిపించింది. కుటుంబానికి జగన్ అన్యాయం చేస్తే. ఇన్నాళ్లు ఎందుకు మౌనంగ ఉన్నారనేది మహిళల నుంచి ఎదురైన ప్రశ్న. అంతేకాదు.. తెలంగాణలో పార్టీ పెట్టుకున్నప్పుడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మొత్తంగా.. జగన్‌పై ఏదో వ్యతిరేక ప్రచారం చేయడం ద్వారా కొంత మైనస్ చేయాలని అనుకున్నా.. అది అనూహ్యంగా ఆయన కూడా ఊహించని విధంగా ప్లస్ కావడం గమనార్హం.