వైఎస్ జగన్ ధీమాకూ ఈ సర్వే సంస్థలు భరోసా!?

మొదటి రెండుసార్లు జరిగిన దానికంటే హోరా హోరీగా, అత్యంత రసవత్తరంగా ఈసారి ఎన్నికలు జరిగాయనే భావించాలి!

Update: 2024-06-01 18:32 GMT

విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ప్రజానికం ఐదేళ్లపాటు చంద్రబాబు పాలనను, మరో 5ఏళ్ల పాటు జగన్ పాలను చూశారు. ఈ సందర్భంగా ఇద్దరి పాలనపైనా ఏపీ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుందనే భావించాలి. ఈ సమయంలో మే 13న ఏపీలో మూడోసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మొదటి రెండుసార్లు జరిగిన దానికంటే హోరా హోరీగా, అత్యంత రసవత్తరంగా ఈసారి ఎన్నికలు జరిగాయనే భావించాలి!

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు అనుభవానికి, మోడీ మేనియాకు ప్రజలు పట్టం కట్టారు! అయితే ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని చంద్రబాబు & కో మాగ్జిమం పోగొట్టుకున్నారనే కామెంట్లు వినిపించాయి! ఫలితంగా 2019లో ఏపీలో ఫ్యాన్ ప్రభంజనం.. ఎక్కడ చూసినా "రావాలి జగన్ - కావాలి జగన్" అనే నినాదాలే! ఫలితంగా 175 కి 151 స్థానాలతో జగన్ సీఎం అయ్యారు.

కట్ చేస్తే... 2024 ఎన్నికలు వచ్చేశాయి. ఈ సమయంలో జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఫలితంగా... తాను అధికారంలోకి వస్తే గతంలో అందించిన పాలనే మరోసారి అందిస్తాననే మాట చెప్పుకోలేకపోయారనే కామెంట్లకు బలం చేకూర్చారు! ఈ సమయంలో "సిద్ధం" అంటూ జనాల్లోకి వెళ్లిన జగన్... తన పాలన నచ్చితేనే, తనవల్ల మీ కుటుంబాల్లో మేలు జరిగితేనే ఓటు వేయమని కోరారు.

ఈ తరహా ప్యూర్ పాలిటిక్స్, పాజిటివ్ పాలిటిక్స్ ఏపీ ప్రజలకే కాదు.. దేశవ్యాప్తంగా ప్రజల్లో సరికొత్త ఆలోచనలు కలిగించాయనే చర్చ జరిగింది. తన పాలన నచ్చితేనే, తన వల్ల మంచి జరిగితేనే అని చెప్పి ఓట్లు అడగడం దాదాపు దేశ చరిత్రలోనే ప్రథమం అనే విశ్లేషణలూ తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో జగన్ మాటలను జనం నమ్మారని.. మహిళలు మరీ ఎక్కువగా విన్నారని తెలుస్తుంది.

అవును... ఏపీలో గత ఐదేళ్లలో జగన్ పాలన పట్ల మెజారిటీ ప్రజలు సానుకూలంగా ఉన్నారని, ప్రధానంగా మహిళాలోకం జగన్ వెంట ఉన్నారని, జగన్ ని నమ్ముతున్నారని, జగన్ మాట మీద నిలబడే నాయకుడని విశ్వసిస్తున్నరనే మాటలకు బలం చేకూరుస్తూ అన్నట్లుగా.. క్రెడిబిలిటీ ఉన్న పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి! ఇందులో భాగంగా... "మళ్లీ జగనే" అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాయి.

ఇందులో భాగంగా... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రెడిబిలిటీ సంపాదించుకున్న పలు సర్వే సంస్థలు ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందనే విషయాన్ని తమ ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా వెల్లడించాయి. ఇందులో భాగంగా... ప్రధానంగా "ఆరా" మస్తాన్ సర్వే... ఏపీలో వైఎస్సార్సీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాలు వస్తాయని.. అంతకంటే ఎక్కువ రావొచ్చు కానీ తక్కువ రావని తెలిపింది.

దీంతో... ఏపీలో మళ్లీ జగనే అనే మాటకు మరింత బలం చేకూరిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో... పార్థ చాణక్య (110 - 120) వైసీపీ గెలుపును మరింత బలంగా చెప్పగా.. అగ్ని వీర్ సంస్థ ఈసారి వైసీపీ 124 - 128, పోల్ స్ట్రాటజీ 115 - 125 సీట్లు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశాయి!

ఇదే క్రమంలో... ఆత్మ సాక్షి (98 - 116), రేస్ (117 - 128), ఆపరేషన్ చాణక్య (95 - 102), పోల్ లేబొరేటరీ (108), జన్ మత్ పోల్స్ (95 - 103), సీపీఎస్ (97 - 108), భారత్ పొలిటికల్ సర్వే (149) మొదలైన సర్వే సంస్థలు.. ఏపీలో ఓటర్లు మరోసారి "రావాలి జగన్ - కావాలి జగన్" అంటున్నారని తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా వెల్లడించిన పరిస్థితి.

దీంతో... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రెడిబిలిటీ ఉన్న పలు సంస్థలు ఏపీలో మరోసారి వైసీపీ గెలుస్తుందని చెప్పడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 9న విశాఖలో సీఎం గా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం అని వైసీపీ నేతలు చెప్పిన నేపథ్యంలో... ఆసక్తి ఉన్నవారు టిక్కెట్లు కన్ ఫాం గా బుక్ చేసేసుకోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News