కోమటిరెడ్డి ఇంత పనిచేశాడా ?!
చివరికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఫోన్ చేయించి రాయబారం పంపారు.
'ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ వద్ద ఇంటి ముందున్న కట్టడం కూల్చివేయించింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని అది లీక్ చేసింది సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ రేవంత్ అంటూ కొత్త ప్రచారం మొదలయ్యింది . ఇది తెలిసిన వెంటనే అది ఆపించమని వైవీ సుబ్బారెడ్డి కోమటిరెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు . చివరికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఫోన్ చేయించి రాయబారం పంపారు. దానికి బాధ్యులైన వారిని తప్పించాం' అని రేవంత్ అన్నారు అని ప్రచారం నడుస్తుంది..
ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు జరిగినప్పుడు దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి ప్రోద్బలంతో అన్న వార్తలు వచ్చాయి. కానీ ఎవరు ఆ మంత్రి అన్న విషయం బయటకు రాలేదు. ఇప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి ఈ విషయం చెప్పాడు అంటూ ప్రచారం జరుగుతుంది .. నిజం గా రేవంత్ ఆలా అన్నారా లేదా అనేది తేలియాలిసి ఉంది .
కోమటిరెడ్డి ఇరకాటంలో పడ్డట్లేనని అంటున్నారు. కోమటిరెడ్డి సోదరులు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి విధేయులు. వారి ఎదుగుదలలో ఆయన పాత్ర ఉంది. వైఎస్ హయాంలో జలయజ్ఞం పనులు చేసి వందలు, వేల కోట్లకు పడగలెత్తారని చెబుతారు. ఇక ఇటీవల ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు జగన్ అధికారంలోకి వస్తాడని వీరు మీడియా సాక్షిగా వెల్లడించారు. అలాంటిది అధికారం పోయిన మరుసటి రోజే జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చడం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిందని తేలిన నేపథ్యంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు కోమటిరెడ్డికి - వైఎస్ జగన్ కు ఎక్కడి బెడిసికొట్టింది అన్న కొత్త చర్చ మొదలయింది. కోమటిరెడ్డి నోరు తెరిస్తే గానీ ఏ విషయం బయటకు రాదు.