వినుకొండకు జగన్... కాన్వాయ్ పై ఆంక్షలంటూ వైసీపీ ఫైర్!

బుధవారం రాత్రి వినుకొండలో నడిరోడ్డుపై రషీద్ అనే యువకుడిని జిలానీ అనే వ్యక్తి అత్యంత పాశవికంగా దాడి చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-19 06:01 GMT

బుధవారం రాత్రి వినుకొండలో నడిరోడ్డుపై రషీద్ అనే యువకుడిని జిలానీ అనే వ్యక్తి అత్యంత పాశవికంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీంతో... వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఓదార్చడానికి జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి గురువారమే వచ్చారు. నేతలతో కీలక భేటీ అనంతరం శుక్రవారం ఉదయం వినుకొండకు బయలుదేరారు.

ఇందులో భాగంగా ఉదయం 10 గంటల తర్వాత తాడేపల్లిలోని తన నివాసం నుంచి వినుకొండకు బయలుదేరారు జగన్. ఈ సమయంలో జగన్ వెంట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు కార్లలో బయలుదేరారు! ఈ సమయంలో జగన్ కాన్వాయ్ కి పోలీసులు చాలా కండిషన్స్ పెట్టారని.. జగన్ భద్రత విషయంలో సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నారని వైసీపీ ఆరోపిస్తుంది.

అవును... తాడేపల్లి నుంచి వినుకొండకు బయలుదేరిన జగన్ కాన్వాయ్ పై పోలీసులు ఆంక్షలు విధించారని.. ఇందులో భాగంగా జగన్ వెంట పార్టీ నేతలు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తుంది! వాస్తవానికి ఉదయం జగన్ తో పాటు పలువురు నేతలు వినుకొండకు బయలుదేరగా... వారి కార్లు జగన్ వెంటవెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు.

ఇదే సమయంలో... వైస్ జగన్ భద్రతపైనా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. గురువారం అర్ధరాత్రి నుంచే జగన్ కు భద్రతను తగ్గించారని.. ఆయన నివాసం వద్దా భద్రతా సిబ్బందిని తొలగించారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇదే సమయంలో జగన్ కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారని ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో... ప్రభుత్వం కేటాయించిన పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం రిపేరులో ఉన్న వాహనం కావడంతో పలుమార్లు మొరాయించిందని.. దీంతో... జగన్ మరో వాహనంలో వినుకొండకు వెళ్తున్నారని వైసీపీ తెలిపింది.

Tags:    

Similar News