వారికి టికెట్లు ఇవ్వను... జగన్ లిస్ట్ సస్పెన్స్....!

వచ్చే ఎన్నికల్లో సిట్టింగులలో కొంతమందికి టికెట్లు రాకపోవచ్చు అని జగన్ హింట్ ఇచ్చారు. అంతమాత్రం చేత వారు బాధపడాల్సింది లేదని పార్టీ వేరేగా వారి సేవలను ఉపయోగించుకుంటుందని ఆయన భరోసా ఇస్తున్నారు.

Update: 2023-09-27 02:45 GMT

వచ్చే ఎన్నికల్లో సిట్టింగులలో కొంతమందికి టికెట్లు రాకపోవచ్చు అని జగన్ హింట్ ఇచ్చారు. అంతమాత్రం చేత వారు బాధపడాల్సింది లేదని పార్టీ వేరేగా వారి సేవలను ఉపయోగించుకుంటుందని ఆయన భరోసా ఇస్తున్నారు. ఇలా ఒక వైపు వార్నింగ్ మరో వైపు హామీ దీంతో వైసీపీ ఎమ్మెల్యేలతో టెన్షన్ నెలకొంది.

సిట్టింగులలో పనితీరు బాగులేని వారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదు అని జగన్ ఘంటాపధంగా చెప్పేశారు. టికెట్లు రాలేదని ఆవేదన వద్దు అంటున్నారు. దీంతో జగన్ నిర్వహించిన రివ్యూ మీటింగ్ అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు అంతా కలవరంతో నిండా మునిగారు అంటున్నారు.

ఎవరెవరికి టికెట్లు రావు అన్న చర్చ అయితే మొదలైంది. టికెట్లు రాని వారు ఏమి చేస్తారో అన్న మరో చర్చ కూడా దాంతో పాటే మొదలైంది. అయితే జగన్ మాట అంటే మాటే కాబట్టి ఆయన ఎవరికైనా టికెట్లు ఇచ్చేది లేదు అంటే వారికి ఇక ఇంతే అని కూడా అనుకుంటున్నారు.

దానికి ఉదాహరణలు కూడా కళ్ల ముందు ఉన్నాయని అంటున్నారు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు టికెట్లు ఇవ్వమని జగన్ వారు ముఖం మీదనే చెప్పడం వల్లనే వారు పార్టీని వీడి ఆరు నెలల ముందే వెళ్లిపోయారు. దాని తరువాత జగన్ వ్యూహం మార్చారు అని అంటున్నారు. నిజానికి వారు కనుక పార్టీలో కొనసాగి ఉంటే ఈ పాటికి ఎవరికి టికెట్లు రావు అన్న లిస్ట్ మొత్తం బయటకు వచ్చేది.

కానీ జగన్ ఇపుడు అలా చేసి విపక్షాలకు చాన్స్ ఇవ్వదలచుకోలేదు అని అంటున్నారు. టికెట్లు రాని వారిని ఆయన తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడిన మీదటనే ఆ విషయం బయటకు చెబుతారు అని అంటున్నారు. ఇక ఆరు నెలల పాటు జనంలో తిరగాలని జగన్ కొత్త డైరెక్షన్ ఇచ్చారు.

అందువల్ల ఈ మధ్యలో ఆయన టికెట్లు రాని వారి జాబితాను ప్రకటించబోరని అంటున్నారు. ఇక ఏపీలో రాజకీయ వాతావరణం కూడా గమనంలోకి తీసుకునే జగన్ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. మామూలుగా అయితే జగన్ వద్ద ఉన్న లిస్ట్ బయటపెట్టేసే ఉండేవారు అనే అంటున్నారు.

మొత్తానికి టికెట్లు దక్కని వారు ఎవరో వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం తెలియడంలేదు అని అంటున్నారు. చూస్తే జాబితా కచ్చితంగా ఇరవై నుంచి పాతిక దాకా ఉంది అని అంటున్నారు. అందులో మంత్రులు కూడా ఉంటారని అంటున్నారు. దాంతో టెన్షన్ తో ఎమ్మెల్యేలలో బీపీ పెరిగిపోతోంది.

మరో ఆరు నెలల పాటు ప్రజలలతో మమేకం కావాలని మాత్రం జగన్ అన్నారు. ప్రతీ వారు అలెర్ట్ గా ఉండాలని ధీమా పనికిరాదు అని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా జగన్ మదిలో ఉన్న లిస్ట్ ఎపుడు బయటకు వస్తుందో తెలియదు కానీ ఎమ్మెల్యేలు అంతా ఫుల్ ఫీవర్ తో ఉన్నారన్నది వైసీపీ ఇన్నర్ సర్కిల్స్ టాక్.

Tags:    

Similar News