అమిత్ షాతో జగన్ భేటీ : బాబు కేసులోకి ఈడీ...?

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తరువాత తొలిసారి ఢిల్లీ వెళ్ళిన జగన్ ఈ సందర్భంగా ఇద్దరు కీలక మంత్రులను కలుసుకున్నారు. ఈడీ అన్నది కేంద్ర ఆర్ధిక శాఖ ఆద్వర్యంలో ఉన్నది.

Update: 2023-10-06 13:40 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో రెండు రోజులుగా పర్యటన చేస్తున్నారు. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ నేపధ్యంలో అనేక ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తరువాత తొలిసారి ఢిల్లీ వెళ్ళిన జగన్ ఈ సందర్భంగా ఇద్దరు కీలక మంత్రులను కలుసుకున్నారు. ఈడీ అన్నది కేంద్ర ఆర్ధిక శాఖ ఆద్వర్యంలో ఉన్నది. దాంతో జగన్ తొలి రోజే నిర్మలా సీతారామన్ తో భేటీ అయినపుడు అనేక విషయాలను చర్చిస్తూ చంద్రబాబు కేసు విషయాన్ని కూడా ప్రస్తావించి ఉంటారని అంటున్నారు.

ఇక స్కిల్ స్కాం కేసులో 2017 ప్రాంతంలో ఈడీ రంగంలోకి దిగి కొంత విచారించింది. ఆ తరువాత ఏమైందో తెలియదు. అందుకే దాని మీద విచారణకు జగన్ కోరవచ్చు అని అంటున్నారు. అదే విధంగా మరో వైపు చూస్తే ఏపీలో వరస కేసులు చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని ముందుకు వస్తున్నాయి. ఫైబర్ నెట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో పాటు స్కిల్ స్కాం వంటివి ఉన్నాయి.

వీటి విషయంలో కేంద్ర పెద్దలకు తాజా పరిస్థితులను వివరించడంతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టిలో ఏపీలో జరుగుతున్న పరిణామాలను తీసుకుని రావడానికి జగన్ ప్రయత్నిస్తారు అని అంటున్నారు. స్కిల్ స్కాం కేసులో షెల్ కంపెనీలకు డబ్బులు వెళ్ళాయని అంటున్నారు. అయితే ఏ ఏ కంపెనీలకు వెళ్లాయన్నది మాత్రం కీలక విషయాల మీద ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.

అలాగే ఫైబర్ నెట్ కేసు కూడా ఉంది అంటున్నారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు వెళ్ళిపోవడం మీద కూడా ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఆయన వస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. ఈ క్రమంలో 27 కోట్ల రూపాయలు టీడీపీ ఖాతాలలోకి వెళ్లాయని సీఐడీ ఏసీబీ కోర్టులో వివరాలు అందించింది.

మొత్తం కేసు 371 కోట్ల రూపాయలు, అందులో 240 కోట్ల రూపాయల దాకా షెల్ కంపెనీలకు మళ్ళాయని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది. అలాగే ఈ కేసులో షెల్ కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలలో ఉన్నాయి. దాంతో ఏపీలోనే మాత్రమే కాకుండా దేశంలో కూడా విచారణ జరగాలని వైసీపీ భావిస్తోంది. అందుకే ఈడీని అవసరం అయితే సీబీఐని కూడా రంగంలోకి దింపడం ద్వారా ప్రభుత్వం ఖజానా నుంచి దారి మళ్ళిన మొత్తం నిధుల గుట్టు రట్టు చేయాలని భావిస్తోంది.

మరో వైపు చూస్తే విదేశాలకు వెళ్ళిన వారిని వెనక్కి రప్పించాలని సీరియస్ గా వైసీపీ ఆలోచిన్స్తోంది. బహుశా ఇవన్నీ అమిత్ షాతో చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ఢిల్లీ టూర్ తరువాత ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది అంటున్నారు.

Tags:    

Similar News