బీజేపీకి జగన్ భారీ ఆఫర్ నిజమేనా...!?

టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకున్నా పెద్దగా రియాక్ట్ కాని వైసీపీ చంద్రబాబు ఢిల్లీ టూర్ చేసి అమిత్ షా తో భేటీ కాగానే అలెర్ట్ అయింది

Update: 2024-02-10 16:30 GMT

ఏపీలో బీజేపీ విషయంలో అటు చంద్రబాబు ఇటు జగన్ పోటీ పడుతున్నారు. నిజానికి వైసీపీ చూస్తే మేము ఒంటరిగా పోటీ చేస్తున్నామని చెబుతున్నా కేంద్రంలోని బీజేపీ అండ ఉందనే నిబ్బరంతోనే ఇంతకాలం ఉంది అని అంటున్నారు. బీజేపీ కూడా టీడీపీతో పొత్తుల విషయంలో వ్యతిరేకంగానే ఉంది అన్నట్లుగా ప్రచారం జరిగింది. దాంతో వైసీపీ బేఫికర్ గా ఉంది అని అంటున్నారు.

టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకున్నా పెద్దగా రియాక్ట్ కాని వైసీపీ చంద్రబాబు ఢిల్లీ టూర్ చేసి అమిత్ షా తో భేటీ కాగానే అలెర్ట్ అయింది. ఆ మరుసటి రోజే జగన్ ఢిల్లీ వెళ్లారు మరి ఇంత హడావుడిగా ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లారు, ప్రధాని మోడీతో ప్రత్యేకంగా ఎందుకు భేటీ వేశారు అన్నది కనుక చూస్తే చాలా విషయాలు దీని వెనక ఉన్నాయని అంటున్నారు.

బీజేపీ ప్లస్ టీడీపీ అయితే ఏపీలో మోడీ అమిత్ షాల రాజకీయ వ్యూహాలు భీకరంగా ఉంటాయి. తెలంగాణాలో కేసీఆర్ ని మాజీ సీఎం ని చేసిన స్ట్రాటజీ బీజేపీది. మోడీ అమిత్ షా ఇప్పటిదాకా ఏపీ వైపు కన్నెత్తి చూడలేదు. పైగా అధికార వైసీపీతో సఖ్యత నెరిపారు. కానీ ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ బీజేపీ తన సొంత ప్రయోజనాలను చూసుకుంటోంది.

ఏపీ నుంచి సొంతంగా తన పార్టీ ఎంపీలను గెలిపించుకోవడానికి బీజేపీ ప్రాధాన్యత ఇస్తోంది. కేంద్రంలో నాలుగు వందల ఎంపీలు బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే టార్గెట్. దానికి అనుకూలంగా ఎన్డీయే కూటమిని బలోపేతం చేస్తోంది. ఎన్డీయే శిబిరాన్ని వీడిన వారిని వెనక్కి పిలుస్తున్నారు. ఏపీలో అయితే టీడీపీ ఎన్డీయే కూటమిలో చేరడానికి రెడీగా ఉంది అని అంటున్నారు. అందుకే పిలిపించారు అని అంటున్నారు.

ఇక వైసీపీ అధినేత జగన్ కూడా ప్రధానితో సమావేశం అయిన నేపధ్యంలో ఎన్డీయే కూటంలో వైసీపీ చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు అని అంటున్నారు. మరి ఈ వార్తలు ఎంత నిజమో తెలియదు కానీ ఇదే కనుక నిజం అయితే బీజేపీకి వైసీపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగానే చూడాలి. ఇప్పటిదాకా వైసీపీ హిస్టరీలో మరే పార్టీతోనూ పొత్తులు పెట్టుకోలేదు

కానీ ఇపుడు బీజేపీతో కలసి నడచేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఇదంతా ఎన్నికల తరువాత అని కూడా అంటున్నారు. అంటే ఏప్రిల్ మే నెలలలో జరిగే ఎన్నికల అనంతరం వైసీపీ కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో చేరుతుందని ఒక హామీని అయితే ఇచ్చి వచ్చారు అని అంటున్నారు.

అంతే కాదు రాజ్యసభలో కూడా మొత్తం 11 ఎంపీల బలం వైసీపీకే ఉంది. అక్కడ టీడీపీకి ఒక్క ఎంపీ కూడా ఇక మీదట ఉండబోరు. ఆ అడ్వాంటేజ్ ని కూడా వైసీపీ బీజేపీ ముందు పెట్టి పొత్తుల విషయంలో న్యూట్రల్ గానే ఉండాలని సూచించింది అని అంటున్నారు. ఇది ఎంతవరకూ నిజం అన్నది తెలియదు. జస్ట్ గాసిప్స్ గానే పొలిటికల్ సర్కిల్స్ లో చక్కలు కొడుతున్నాయి. ఏది ఏమైనా ఒక్క మాట మాత్రం వాస్తవం. ఏపీలో బీజేపీకి బలం లేదు అని అంటున్న వారు విపక్షాలు కొన్ని పార్టీలు మాత్రమే.

ప్రధాన పార్టీలకు బీజేపీ బలం తెలుసు కాబట్టే ఆ పార్టీ అధినాయకత్వాలతో భేటీలు వేస్తున్నారు అని అంటున్నారు. ఇక రాజకీయాల్లో పొత్తులు కలయికలు విడాకులు అన్నీ మామూలే. ఏపీలో కూడా టీడీపీ బీజేపీతో కలసినా లేక వైసీపీతో లోపాయికారిగా బంధాలను నెరపినా కూడా అన్నీ రాజకీయాలే. సో ఏపీలో ఏమి జరుగుతుంది అన్నది ఇంకా ఈ రోజుకి అయితే ఒక స్పష్టత అయితే లేదు అనే అంటున్నారు.

Tags:    

Similar News