యెలహంక పాలెస్ లో జగన్ ఏమి చేస్తున్నట్లు ?
జగన్ ఇపుడు బెంగళూరులో తాను ఒకనాడు మోజు పడి కట్టించుకున్న 27 ఎకరాల సువిశాల మైన యెలహంక పాలెస్ లో రెస్ట్ మోడ్ లో ఉంటున్నారు
జగన్ ఇపుడు బెంగళూరులో తాను ఒకనాడు మోజు పడి కట్టించుకున్న 27 ఎకరాల సువిశాల మైన యెహలంక పాలెస్ లో రెస్ట్ మోడ్ లో ఉంటున్నారు. జగన్ ఈ పాలెస్ కట్టించుకున్న తరువాత పట్టుమని పది రోజులు కూడా గడపలేదని అంటున్నారు. ఆయనకు ఆ చాన్స్ ఇపుడు వచ్చింది అని అంటున్నారు.జగన్ పులివెందుల నుంచి నేరుగా బెంగళూరు వెళ్లిపోయారు. అలా పాలెస్ లో ఆయన గడుపుతున్నారు.
ఇంతకీ జగన్ లంకంత పాలెస్ లో ఏమి చేస్తున్నట్లు అన్నది ఒక చర్చగా ఉంది. టీడీపీ అనుకూల చానల్స్ అయితే జగన్ మీద వరసబెట్టి కధనాల మీద కధనాలు వండి వారుస్తున్నాయి. అందులో కీలకమైన పాయింట్ ఏంటి అంటే జగన్ యెహలంక పాలెస్ నుంచి జగన్ తిరిగి ఏపీకి రారు అని ఆయన అక్కడే ఉంటారు అని కూడా జోస్యం చెబుతూ కధనాలు రాస్తున్నారు.
జగన్ హైదరాబాద్ కి కూడా రారు అని అక్కడ రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయన జగన్ పక్కా వ్యతిరేకి అని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా మీట్ లో జగన్ మీద తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యలను చూపీస్తూ జగన్ తో రాజకీయ ఆట ఆడుకుంటారు అని అంటున్నారు.
పరిపాలన చేయకుండా ఎంజాయ్ చేస్తే ఇలాగే ఉంటుందని జగన్ కి దక్కిన భారీ ఓటమి మీద రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ని కూడా గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో లోటస్ పాండ్ భవనం ముందు నిర్మాణాలను కూలగొట్టిన దాని మీద కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇలా జగన్ మీద తన పూర్తి వ్యతిరేకతను అయితే రేవంత్ రెడ్డి చూపించేశారు.
ఇదిలా ఉంటే యెలహంక పాలెస్ లో జగన్ ఏమి చేస్తున్నారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. యెలహంక పాలెస్ నుంచి హెలికాప్టర్ ద్వారా వెళ్ళి చాలా సీక్రెట్ గా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని జగన్ కలిశారు అని టీడీపీ అనుకూల చానల్స్ అయితే తెగ ఊదరగొడుతున్నాయి.
తన సొంత చెల్లెలు షర్మిలతో సెటిల్మెంట్ చేయమని జగన్ డీకేని కోరారని కూడా వార్తా కధనాలను రాస్తున్నారు. ఆస్తులు అన్నీ తాను పంచేశాను అని జగన్ డీకేకు చెప్పినట్లుగా చెబుతున్నారు. తమ ఫ్యామిలీ అంతా ఒక్కటి చేసేలా ఒక మీటింగ్ ని ఏర్పాటు చేయమని డీకేను జగన్ కోరారని అనుకూల చానల్స్ లో వార్తలు వస్తున్నాయి.
అంతే కాదు తన వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి జగన్ చూస్తున్నారు అని కూడా వార్తా కధనాలు వస్తున్నాయి. ఇలా ఒకటి కాదు ఏది అయినా వార్తే అన్నట్లుగా అల్లుకుపోతూ చాలా వార్తా కధనాలను టీడీపీ అనుకూల చానల్స్ రాస్తున్నాయని అంటున్నారు.
అయితే ఈ తరహా వాదనలో ఎంత వరకూ నిజం ఉంది అన్నది పక్కన పెడితే లాజిక్ మిస్ అవుతూనే ఈ వార్తలు వండుతున్నారు అని అంటున్నారు. అది ఎలా అంటే జగన్ తన సొంత కుటుంబంలో గొడవలకు డీకేని ఎందుకు ఆశ్రయిస్తారు అని అంటున్నారు. డీకే కాంగ్రెస్ పార్టీ నాయకుడు.
తనను పదహారు నెలలు అకారణంగా కాంగ్రెస్ జైలులో పెట్టించింది అని జగన్ నమ్ముతున్న కాంగ్రెస్ నేత ద్వారా ఈ రాయబారాలు ఎందుకు నడుపుతారు అని అంటున్నారు. జగన్ తన కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలీ అంటే తన తల్లి విజయమ్మ ద్వారానే ఆ పని చేస్తారు అని అంటున్నారు. చెల్లెలుతో సయోధ్య కుదర్చడానికి తల్లి విజయమ్మ ఉండగా వేరే పార్టీ పక్క రాష్ట్రం నాయకుడు కావాల్సి వస్తారా అని కూడా అంటున్నారు
ఇక జగన్ మనస్తత్వం తెలిసిన వారు కాంగ్రెస్ పట్ల ఆయన పూర్తి వ్యతిరేకతతో కడదాకా ఉంటారనే అంటున్నారు. అలాంటి కాంగ్రెస్ లోకి తన పార్టీని విలీనం ఎందుకు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. తన పార్టీని ఎప్పటికీ ఒంటరిగానే నడుపుతారని ఒకవేళ నడపలేని రోజున మూసుకుంటారు కానీ వేరే పార్టీలో చేర్చి వారి సూచనలు సలహాలు పాటించే స్వభావం జగన్ ది కాదని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే జగన్ అసలు యెలహంక పాలెస్ లో ఏమి చేస్తున్నారు అంటే జవాబు వైసీపీ సైడ్ నుంచి లేవు. అయితే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు అని తొందరలోనే తాడేపల్లికి వచ్చి మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతారు అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ మీద వ్యతిరేక మీడియాలో వస్తున్న వార్తలు వైసీపీ క్యాడర్ ని అయితే పూర్తి అయోమయంలో పడేస్తున్నాయని అంటున్నారు.