మంత్రులైనా ఎంతటి వారైనా...జగన్ లెక్క పక్కాగా అదేనట...?

కావాల్సినంత టైం ఇచ్చినా పార్టీ పరంగా గ్రాఫ్ పెంచుకోని వారు ఉంటే కనుక టికెట్ కి టిక్కు పెట్టడం ఖాయమని తాడేపల్లి వైపుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

Update: 2023-08-11 17:05 GMT

వైసీపీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలి. ఎవరిని పక్కన పెట్టాలి ఇదే జగన్ ఆలోచనగా సాగుతోంది. ఎవరినీ వదులుకోను, నాతో పాటుగా మీరంతా వచ్చే అసెంబ్లీలో సైతం కనిపించాలి అని జగన్ ఆ మధ్య వర్క్ షాప్ సందర్భంగా పార్టీ వారికి చెప్పారు. అయితే పనితీరు బాలేకపోతే తానేమీ చేయలేనని కూడా చెప్పారు. కావాల్సినంత టైం ఇచ్చినా పార్టీ పరంగా గ్రాఫ్ పెంచుకోని వారు ఉంటే కనుక టికెట్ కి టిక్కు పెట్టడం ఖాయమని తాడేపల్లి వైపుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

ఈ లిస్ట్ లో ఎవరైనా ఉండవచ్చు అని అంటున్నారు. వారు మంత్రులు అయినా జగన్ కి బాగా క్లోజ్ అయినా సరే ఎంతటి పెద్ద వారు అయినా సరే గ్రాఫ్ రివర్స్ కొడితే టికెట్ బోల్తా కొడుతుందని అంటున్నారు. ఇది నిజంగా ప్రచరామా జగన్ అలా చాలా మంది పెద్దలకే టికెట్లు లేకుండా చేస్తారా ఆంటే అవుని అదే నిజం అని అంటున్నారు. మరి ఇంతకీ జగన్ దగ్గర ఉన్న సర్వేలు ఏమి చెబుతున్నాయి ఎవరెవరికి టికెట్లు దక్కకుండా పోతాయన్నది కనుక చూసుకుంటే చాలా పెద్ద లిస్టే అని అంటున్నారు.

ఇక వైసీపీ అధినాయకత్వం ఆ పార్టీ స్లోగన్ అయిన వై నాట్ 175 కి తగినట్లుగానే అభ్యర్ధుల సెలక్షన్ చేస్తోంది అని అంటున్నారు. కీలకమైన నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్ధుల ఎంపిక అన్న అతి పెద్ద కసరత్తు ముమ్మరంగా సాగుతోందని జోరుగా ప్రచారం అయితే ఉంది.ఏ అభ్యర్ధి అయితే సునాయాసంగా గెలుస్తారు అన్నది వడపోత పట్టే కార్యక్రమం సాగుతోంది అని అంటున్నారు.

అలాగే ఏ నియోజకవర్గంలో ఎవరి గెలుపు కష్టంగా ఉంది. అలాగే ఏ అభ్యర్ధి కొంచెం కష్టపడితే గెలవగలరు అన్న డేటా కూడా పార్టీ వద్ద ఉందని అంటున్నారు. ఇలా కనుక చూస్తే టోటల్ గా 175 నియోజకవర్గాలలోని డేటా అంతా పాటీ వద్ద ఉందని, దీని మీద పూర్తి స్థాయి కసరత్తు కూడా పూర్తి అయింది అని అంటున్నారు.

ఈ డేటా నుంచే తుది జాబితాను తయారు చేస్తే మాత్రం ఎమ్మెల్యేలలో చాలా మందికి అలాగే మంత్రులలో కూడా కొందరికి టికెట్ దక్కని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఇక ఎన్నికలు చూస్తే కొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది కాబట్టి అప్పటిలోగా గ్రాఫ్ కొత్తగా పేరిగేది కూడా లేదని అంటున్నారు. గత ఏడాది కాలంగా జగన్ చెప్పినట్లుగా కనుక నాయకులు జనంలోకి వెళ్ళి ఉంటే వారి గ్రాఫ్ పెరిగేది అని అంటున్నారు. అలా వెళ్ళిన వారిలో గతంలో డేంజర్ జోన్ లో ఉన్న వారు సేఫ్ జోన్ లోకి వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయట.

ఇక టికెట్ దక్కని వారి జాబితాలో ఉత్తరాంధ్రాకు చెందిన ఒక యువ మంత్రితో పాటు కోస్తా జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నట్లుగా ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. అలాగే రాయలసీమకు చెందిన ఒక మహిళా మంత్రికి టికెట్ కష్టమని ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ మీద తెల్లారితే గట్టిగా విమర్శలు చేసే ఆయన సామాజిక వర్గానికి చెందిన మంత్రికి కూడా టికెట్ కట్ అని అంటున్నారు.

ఇక్కడ గెలుపు ఒక్కటే ప్రమాణంగా తీసుకుంటున్నారని అంటున్నారు. జగన్ కి ఎంత సన్నిహితులు అయినా జనంలో వారు లేకపోయినా గెలుపు గుర్రాలు కాకపోయినా టికెట్ నో చెప్పేస్తారు అని అంటున్నారు. మరి చాలా పకడ్బంధీగా రూపొందిస్తున్న ఈ జాబితా కనుక అనుకున్నట్లుగా ప్రచారంలో జరిగినట్లుగా కనుక వస్తే మాత్రం చాలా మందికి షాకుల మీద షాకులు తప్పవని అంటున్నారు. మరి టికెట్ కోసం ఎవరెంతగా తాడేపల్లికి తిరిగినా జగన్ని ప్రసన్నం చేసుకోవాలని చూసినా కూడా వై నాట్ 175 స్లోగన్ ముందు అవేమీ నిలబడవని అంటున్నారు. సో అదన్న మాట మ్యాటర్.

Tags:    

Similar News