జ‌నం చెప్పారు.. జ‌గ‌న్ మేల్కొన్నారు... !

తాజాగా విశాఖ‌లో ప‌ర్య‌టించి అచ్యుతాపురం బాధితుల‌ను ఆయన ఓదార్చారు.

Update: 2024-08-26 09:30 GMT

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ 11 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోసం ఫైట్ చేస్తున్నారు. ఇది వ‌చ్చేనా.. లేదా.. అనేది త‌ర్వాత తెలుస్తుంది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న కీల‌క కార్య‌క్ర‌మానికి రెడీ అయ్యారు. అదే.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం.. కార్య‌క‌ర్త‌ల కు క‌నిపించ‌డం.. వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నాలు చేయ‌డం. తాజాగా విశాఖ‌లో ప‌ర్య‌టించి అచ్యుతాపురం బాధితుల‌ను ఆయన ఓదార్చారు. ఈ స‌మ‌యంలో కొందరు మీరు ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని కోరారు.

ఔను.. నిజం., దీనికి సంబంధించి వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల‌తో జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ప్ర‌జ‌లు, పార్టీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌వేశించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల‌ని తాజాగా ఆదేశించినట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యాన్ని ఊహించ‌ని జ‌గ‌న్‌.. త‌నంత‌టివాడు లేడ‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. త‌ను త‌ప్ప‌.. ప్ర‌జ‌ల‌కు దిక్కులేద‌ని.. అనుకున్నారు. త‌న‌ను గెలిపించి తీరుతార‌ని కూడా లెక్క‌లు వేసుకున్నారు.

కానీ, తీర్పు భిన్నంగా వ‌చ్చింది. అప్ప‌ట్లో ప్ర‌జ‌ల‌కు చేరువ‌కావాలి. .పార్టీ కేడ‌ర్‌ను ప‌ట్టించుకోవాల‌ని.. చాలా మంది నాయ‌కులు చెప్పుకొచ్చా రు. కానీ, జ‌గ‌న్‌కు వినిపించ‌లేదు. తొలి ఏడాది అంటే.. 2019లో ఏదో కొన్ని రోజుల పాటు.. పార్టీ కార్యాలయంలో ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించినా.. త‌ర్వాత‌.. దానిని పూర్తిగా మ‌రిచిపోయారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు అన్నీ మేళ్లే చేస్తున్నాం.. ఇక‌, వారికి స‌మ‌స్య‌లు ఏముంటాయ‌ని కూడా గ‌డుసు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం కూడా గుర్తుండే ఉంటుంది.

మ‌రోవైపు ప్ర‌జ‌ల‌కు-వ‌లంటీర్ల‌కు మ‌ధ్య బంధాన్ని పెంచారు. చివ‌ర‌కు అది ఎదురు దెబ్బ‌కొట్టింది. దీంతో ఇప్పుడు అస‌లు వాస్త‌వం తెలిసింది. దీనికి తోడు.. తాజాగా ప్ర‌జ‌లు కూడా మీరు ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని కోరుకున్నారు. ఈ నేప‌థ్యంలో కొత్తగా కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఇక‌, నుంచి ఆదివారం మిన‌హా మిగిలిన ఆరు రోజుల పాటు తాడేప‌ల్లి లోని పార్టీ కార్యాల‌యంలో జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌నున్నారు. దీనికి సంబంధించి ఒకే సారి 100 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు.

Tags:    

Similar News