విశాఖలో జగన్ కీలక మీటింగ్...బ్రహ్మాస్త్రం బయటకు ..!
విశాఖ నగరంలో ఆదివారం జగన్ నిర్వహించిన రోడ్ షోకు మంచి స్పందన లభించింది.
ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ విశాఖ అంటే బాగా ఇష్టపడతారు. ఆయన ప్రస్తుతం నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర విశాఖలో జోరుగా సాగుతోంది. విశాఖ నగరంలో ఆదివారం జగన్ నిర్వహించిన రోడ్ షోకు మంచి స్పందన లభించింది. ఇక జగన్ విశాఖలోనే సోమవారం కూడా ఉండబోతున్నారు.
ఈ సందర్భంగా వైసీపీకి విశాఖలో ఉన్న ఆఫీసులో జగన్ అత్యంత కీలకమైన సమావేశాన్ని సోమవారం నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. ఈ మీటింగులో ఎన్నికల మేనిఫెస్టో మీద చర్చిస్తారు అని అంటున్నారు. ఈ మీటింగు కోసం వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలకు ఆహ్వానం ఇప్పటికే అందినట్లుగా తెలుస్తోంది.
ఈ సమావేశంలో ఎన్నికల ప్రణాళిక మీద తుది నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ అంతా బస్సు యాత్ర చేసిన జగన్ నేరుగా జనాలతో కనెక్ట్ అయ్యారు. అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకున్నారు. అదే విధంగా ఒక బాక్స్ ని ఏర్పాటు చేసి మరీ ప్రజల నుంచి వైసీపీ మేనిఫెస్టో కోసం సలహా సూచనలు కూడా తీసుకున్నారు.
దాంతో పాటు వైసీపీ గత అయిదేళ్లలో అమలు చేస్తున్న పధకాలు ఉన్నాయి. వాటికి మరింతగా నిధులను పెంచి కొనసాగించడం కొత్త హామీలు వివిధ వర్గాల వారికి ఇవ్వడం అన్నది వైసీపీ మ్యానిఫెస్టోలో చూడవచ్చు అని అంటున్నారు. అదే విధంగా ఏపీవ్యాప్తంగా ఉన్న అరవి లక్షల కుటుంబాలు అయిన రైతులకు రుణ మాఫీని అమలు చేయలని జగన్ బస్సు యాత్ర సాగిన ప్రతీ చోటా విన్నపాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.
దాంతో ఈ విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. రైతు రుణమాఫీని కనుక జగన్ ప్రకటిస్తే ఏపీలో వార్ వన్ సైడ్ అయిపోతుందని కూడా ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖజనాకు భారంగా ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. రైతు రుణమాఫీ చేస్తే ఎంతవరకూ చేయాలి. కటాఫ్ ఎమౌంట్ ఎంత దాకా పెట్టాలి అన్నది కూడా చర్చిస్తున్నారు. 2014లో చంద్రబాబు రైతు రుణ మాఫీ అని చెప్పి ఆ తరువాత భారీగా కోతా విధించారు. సరిగ్గా అమలు చేయలేకపోయారు.
అయితే ఇపుడు ఏపీలో కొంత ఆర్ధికంగా కుదుట పడే పరిస్థితి ఉందని కాబట్టి రైతు రుణ మాఫీని అమలు చేయవచ్చు అన్నది వైసీపీ నేతల మాట. అదే కనుక అమలు చేస్తే టోటల్ ఏపీ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ గా ఉంటుందని భావిస్తున్నారు. మరో వైపు చూస్తే డ్వాక్రా మహిళలకు కూడా రుణ మాఫీ లాంటి భారీ హామీని ఇవ్వవచ్చు అని చర్చ సాగుతోంది.
మొత్తానికి చూస్తే ఈసారి వైసీపీ ఎన్నికల ప్రణాళికలో భారీగానే హామీలు ఉంటాయని అంటున్నారు. అలాగే బ్రహ్మాస్త్రం కూడా ఇదే అవుతుందని వైసీపీ భావిస్తోంది. ఈ మ్యానిఫెస్టోని విశాఖలో నిర్వహించే వైసీపీ కీలక నేతల సమావేశంలో ఆమోదించిన మీదట ఈ నేల్ 26 లేదా 27 తేదీలలో దానికి విడుదల చేయడానికి జగన్ సిద్ధం అవుతున్నారు అని అంటున్నారు. ఇప్పటిదాకా చూస్తే ఏపీలో టీడీపీ కూడా ఎన్నికల ప్రణాళిక విడుదల చేయలేదు.
మరి వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టోని చూసి టీడీపీ తన మ్యానిఫెస్టోకి తుది మెరుగులు దిద్దుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా వైసీపీ మేనిఫెస్టోనే ముందు ప్రజల్లోకి రాబోతోంది అని అంటున్నారు. మొత్తం మీద విశాఖ వేదికగా వైసీపీ ఎన్నికల ప్రణాళిక ఈసారి పురుడు పోసుకోనుంది. అందుకో సంచలన అంశాలు ఏమేమిటి ఉన్నాయన్నది కూడా ఎంతో కొంత తెలిసే అవకాశం అయితే కొద్ది గంటలలోనే ఉంది అని అంటున్నారు.