ఉన్నపలంగా ఏపీకి జగన్... తీసుకోబోయే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ!

అవును... వినుకొండలో బుధవారం రాత్రి జరిగిన అత్యంత పాశవికమైన చర్య ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-07-18 08:16 GMT

వినుకొండలో బుధవారం రాత్రి జరిగిన హత్యోదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఏ ఇద్దరు కలిసినా వారి మధ్య ఈ ఘటనకు సంబంధించిన చర్చ జరుగుతుందని చెప్పినా అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయా హుటాహుటిన ఏపీకి వస్తున్నారు.

అవును... వినుకొండలో బుధవారం రాత్రి జరిగిన అత్యంత పాశవికమైన చర్య ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రషీద్ అనే యువకుడిని.. టీడీపీ కార్యకర్తగా చెబుతున్న జిలానీ అనే వ్యక్తి అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ సమయంలో రషీద్ చేయి తెగి రోడ్డుపై పడిపోవడం గమనార్హం.

ఈ ఘటనపై తొలుత జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడా కనిపించడమే లేదని.. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణలేకుండా పోయిందని.. వైఎస్సార్సీపీని అణగదొక్కాలన్న కోణంలోనే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో... అధికారం శాస్వతం కాదని.. హింసత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నట్లు చెప్పిన జగన్... రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అధైర్యపడొద్దని.. కార్యకర్తలందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు!

ఇదే సమయంలో... వినుకొండలో టీడీపీ కార్యకర్త చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెల్లియజేస్తున్నట్లు ప్రకటించారు జగన్. అయితే... ఈ సమయంలో కార్యకర్తలకు భరోసాని ఇచ్చేది ట్వీట్ కాదని గ్రహించారో ఏమో కానీ... ఉన్నపలంగా బెంగళూరు పర్యటన రద్దుచేసుకుని ఏపీకి బయలుదేరుతున్నారు జగన్.

ఈ మేరకు దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఇందులో భాగంగా మధాహ్నం 1:15 నిమిషాలకు యలహంక నివాసం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. అనంతరం 3:45 గంటలను ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకుంటారు. 4 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

అనంతరం జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఘటనపైనా, ఇప్పటివరకూ జరిగిన ఘటనలపైనా తీవ్రంగా స్పందిస్తారని ఒకరంటే... వినుకొండకు వెళ్లే అవకాశాలున్నాయని మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా... ఇప్పుడున్న వాతావరణంలో ఇది కీలక పరిణామం అనే చెప్పాలి!!

Tags:    

Similar News