జగన్ ని ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకోవడానికి మనుషులు కావలెను !

జగన్ దాదాపుగా పది రోజుల తరువాత తాడేపల్లి నివాసానికి వస్తున్నారు. దాంతో జగన్ ని రిసీవ్ చేసుకోవాలంటూ కృష్ణా గుంటూరు జిల్లలా నాయకులకు ఫోన్లు వెళ్లాయని అంటున్నారు.

Update: 2024-07-01 16:57 GMT

అదేంటి జగన్ అంటే జనం కదా. జగన్ వస్తే జన సముద్రం కదా అని అంతా అనుకుంటారు. జగన్ సభలకు ఇసుక వేస్తే రాలనంతగా జనాలు రావడం ఒక ముచ్చట. జగన్ ని కలిసేందుకు వందల వేలలో నాయకులు తాడేపల్లికి క్యూ కట్టడం ఒక చరిత్ర. కానీ ఇపుడు అందంతా ఒక గతం గా మారింది అని అంటున్నారు. ఓటమి పాలు అయిన జగన్ అసెంబ్లీకి వస్తే ఆయన కారును చుట్టు ముట్టి ఆకతాయిలు కొందరు జగన్ మామయ్య అని రచ్చ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

ఆనాడు కూడా జగన్ చుట్టూ పెద్దగా నాయకులు లేరు. అధికారం మబ్బులు కరిగిపోయిన వేళ జగన్ రియల్ గా ఏమిటి అన్నది ఆ సంఘటన చూపించింది. ఇదిలా ఉంటే గత నెల పులివెందుల వెళ్ళి అటునుంచి బెంగళూరులో వారం పైగా రెస్ట్ తీసుకుని ఏపీకి వస్తున్న జగన్ కి ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకుని స్వాగతం పలకడానికి జనాలు కావలెను అని సెటైర్ల తో కూడిన న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

జగన్ దాదాపుగా పది రోజుల తరువాత తాడేపల్లి నివాసానికి వస్తున్నారు. దాంతో జగన్ ని రిసీవ్ చేసుకోవాలంటూ కృష్ణా గుంటూరు జిల్లలా నాయకులకు ఫోన్లు వెళ్లాయని అంటున్నారు. మాజీ సీఎం ఆఫీసు నుంచే ఈ ఫోన్లు వెళ్ళాయని అంటున్నారు. అయితే నాయకులు క్యాడర్ అయితే అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని అంటున్నారు. దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగుతోంది

అసలు అలా ఎందుకు జరుగుతోంది అన్నది కూడా చర్చ సాగుతోంది. జగన్ అయిదేళ్ళ పాటు తిరుగులేని అధికారాన్ని అందుకున్నారు. ముఖ్యమంత్రిగా శాసించారు. ఆ టైంలో కనుక క్యాడర్ ని లీడర్స్ ని పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటున్నారు.

Read more!

ఎంతసేపూ వాలంటీర్లనే బలం అనుకుని సొంత పార్టీని పట్టించుకోకుండా వ్యవహరించారని, తానే స్వయంగా పార్టీ ని చంపేశారు అని అంటున్నారు. అధికారంలో ఉన్నపుడు ఏమీ చేయని కారణంగానే ఇపుడు విపక్షంలోకి వచ్చకా అంతే స్థాయిలో క్యాడర్ లీడర్ కూడా రియాక్షన్ ఇస్తోందని అంటున్నారు.

జగన్ ఇపుడు ఏమి చేద్దామన్నా అధికారం అయితే ఆయన చేతిలో లేదు. దాంతో ఆయనకు ముఖం చాటేసే వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. ఎవరైనా అధికారంలోకి వస్తే పార్టీని బాగుచేసుకుంటారు. పటిష్టం చేసుకుంటారు. కానీ వైసీపీ అధినేత రివర్స్ గేర్ పాలిటిక్స్ చేశారు అని అంటున్నారు. అందుకే దానికి తగిన రిజల్ట్ వస్తోందని అంటున్నారు. మొత్తం మీద నిజానిజాలు ఏమిటో తెలియకపోయినా జగన్ ని రిసీవ్ చేసుకోవడానికి నేతలకు కరవు వచ్చిందా అన్నది మాత్రం హాట్ టాపిక్ అనే అంటున్నారు.

Tags:    

Similar News