జగన్ కోసం బారికేడ్ దాటి...హత్తుకున్న సీఎం...!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనలో అనేక చిత్రాలు చోటు చేసుకున్నాయి. పలాసాలో జరిగిన బహిరంగ సభ జనాలతో హోరెత్తింది.

Update: 2023-12-15 03:50 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనలో అనేక చిత్రాలు చోటు చేసుకున్నాయి. పలాసాలో జరిగిన బహిరంగ సభ జనాలతో హోరెత్తింది. ఇచ్చిన మాటకు కట్టుబడి వందల కోట్ల రూపాయలతో పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రాభరించారు. అలాగే పలాసా ఇచ్చాపురంలోని వందలాది గ్రామాలకు రక్షిత మంచి నీటి కోసం ఏడు వందల కోట్ల రూపాయలతో వంశధార ఎత్తిపోతల పధకానికి జగన్ ప్రారంభించి ఉద్ధానం రుణం తీర్చుకున్నారు.


ఈ విషయంలో జగన్ని మెచ్చుకున్న వారే నూటికి నూరు శాతం ఉన్నారు. దశాబ్దాల తలరాతను జగన్ మార్చారని అంతా అంటున్న నేపధ్యం ఉంది. ఇక జగన్ని చూసేందుకు జగన్ పోటెత్తారు. జగన్ సభ జరుగుతూంటే ఆయనను కలిసేందుకు బారెకేడ్లు దాటి జనం రావాలని చూశారు.


అయితే ముఖ్యమంత్రి జగన్ తో సెల్ఫీ దిగాలని పలాసకు చెందిన ఏడో తరగతి విద్యార్ధి టి. దిలీప్ సభా ప్రాంగణంలో బారికేడ్లుపై ఎక్కగా వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆ విద్యార్థిని వారించారు. అదే సమయంలో సీఎం జగన్ అలాంటి ప్రమాదకర ప్రయత్నం చేయవద్దని చెబుతూనే ఆ విద్యార్ధిని తన దగ్గరకు పిలిపించుకున్నారు. విద్యార్ది దిలీప్ తో సెల్ఫీ దిగి ఆత్మీయంగా హత్తుకున్నారు.


అలా ఆ బాలుడి కళ్లలో ఆనందం మెరిపించారు. అంతే కాదు బారికేడ్ల అవతల ఉన్న మహిళలు యువత అంతా జగన్ కోసం చేతులు చాస్తే అందరి వద్దకు వెళ్ళి పలకరించి మురిపించారు. మొత్తానికి పలాసలో సీఎం జగన్ సభ సూపర్ సక్సెస్ అయింది అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికలు దగ్గరపడిన వేళ జనాలు పెద్ద ఎత్తున తరలిరవంతో పలాస ఈసారి కూడా వైసీపీదే అని అంటున్నారు. మంత్రి సీదరి అప్పలరాజు రెండవసారి ఎమ్మెల్యే అవుతారు అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News