నిద్రావస్తలో జగన్ పరివారం.. ఇలా అయితే కష్టమే గురూ..!
అనుకూల మీడియా.. అనుకూల నాయకులు.. ఇప్పుడున్న రాజకీయాల్లో ఈ రెండు అత్యంత కీలకం
అనుకూల మీడియా.. అనుకూల నాయకులు.. ఇప్పుడున్న రాజకీయాల్లో ఈ రెండు అత్యంత కీలకం. అధి నేతలను బలపరిచే నాయకులు, అదేసమయంలో అనుకూలంగా వార్తలు రాసుకునే మీడియా.. ఉండాల్సి న అవసరం ఎంతైనా ఉంది. తాజాగా జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో టీడీపీకి కలిసి వచ్చింది ఈ రెండే. అటు అనుకూల నాయకులు, ఇటు మీడియా కూడా భారీ ఎత్తున సహకరించినందునే.. చంద్రబాబు సక్సెస్ అయ్యారు. లేకపోతే.. ఇబ్బందులు తప్పేవి కాదు.
అయితే.. జగన్ విషయంలో ఈ రెండు అంశాలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఆయనకు అను కూలంగా మాట్లాడే నాయకులు తగ్గిపోతున్నారు. అంతేకాదు.. ఆయనను సమర్థిస్తున్నవారు కూడా సన్న గిల్లు తున్నారు. కీలక నాయకులు జంప్ చేస్తున్నారు. మరికొందరు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా రు. దీంతో జగన్ను సమర్థిస్తున్నవారు ఎవరు? ఎంతమందిజగన్ తరఫున మాట్లాడుతున్నారు.. అంటే.. పెద్దగా లేరనే తెలుస్తోంది.
నిజానికి జగన్ అధికారంలో ఉన్నప్పుడుప్రజలతో నేరుగా సంబంధాలు లేని సజ్జల రామకృష్నారెడ్డి వంటివారు.. మీడియా ముందుకు వచ్చారు. లేకపోతే..పరుషంగా వ్యాఖ్యానించేవారు.. మీడియాతో మాట్లాడారు. దీంతో మీడియాసంస్థల రేటింగ్ పెరిగినా.. జగన్ రేటింగ్ మాత్రం తగ్గిపోయింది. ఇక, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఎవరూ ముందుకు రావడం లేదు. అంబటి రాంబాబు వచ్చినా.. బోర్ కొట్టిస్తున్నారు. దీంతో ఊపు లేకుండాపోయింది.
ఇక, జగన్‌కు ఉన్న సొంత మీడియా బలమైన ప్రోజెక్షన్ ఇవ్వలేక పోతోంది. వార్తలో పస ఉండడం లేదు. వైసీపీపై వస్తున్న విమర్శలను బలంగా ఎదుర్కొనేందుకు కూడా జగన్ మీడియా ప్రయత్నించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా కర్నూలులో జరిగిన హత్యకు సంబంధించి పోలీసులు ఇచ్చిన వివరణలో వైసీపీ నాయకుల ప్రమేయం లేదని.. అంతా టీడీపీ నేతలే చేసుకున్నారని స్పష్టమైంది. కానీ, ఈ అంశాన్ని ప్రస్తావించడంలో జగన్ మీడియా పూర్తిగా డమ్మీ అయిపోయింది. ఎక్కడా ఒక్క మాట కూడా లేదు. ఇదేసమయంలో జగన్‌ను వ్యతిరేకించే ఈనాడులో ఈ వార్త రావడం గమనార్హం. మరి ఇలా అయితే కష్టమే కదా!!